మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరికి కంప్లీట్ కానుందని సమాచారం. ఈ సినిమాతో పాటు చరణ్.. ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి తర్వాత నుంచి చరణ్ ఆచార్య సినిమా షూటింగ్లో పాల్గొంటారు. అయితే.. ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ ఏ సినిమాలో నటించనున్నారు అనేది అఫిషియల్ గా ప్రకటించలేదు.

కొంత మంది దర్శకులు చరణ్ తో సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నారు. దీంతో ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది. అయితే.. జెర్సీ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయడానికి చరణ్ ఓకే చెప్పారని తెలిసింది. ఈ సినిమాని ఎన్.వి.ప్రసాద్ నిర్మించనున్నారు. గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం బాలీవుడ్ లో జెర్సీ రీమేక్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది పూర్తి చేసిన తర్వాత చరణ్ తో సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
చరణ్ ఓకే చెప్పిన మరో డైరెక్టర్ ఎవరంటే.. కార్తీతో ఖైదీ, విజయ్ తో మాస్టర్ సినిమాలను తెరకెక్కించిన తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అని తెలిసింది. రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ చరణ్ కి కథ చెప్పడం జరిగిందని.. ఈ కథ విని చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఆచార్య షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాని ముందుగా స్టార్ట్ చేయాలనేది డిసైడ్ చేస్తారట. ఈ రెండు సినిమాలను వచ్చే సంవత్సరమే రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం.
Must Read ;- మెగా బ్రదర్స్ సినిమాల రిలీజ్ డేట్స్ ఇవేనా..!











