సంక్రాంతికి పవన్, ప్రభాస్ పోటీపడడం ఏంటి..? ఈ సంక్రాంతికి పవన్ సినిమా కానీ.. ప్రభాస్ సినిమా కానీ.. రిలీజ్ కావడం లేదు కదా. మరి.. వీరిద్దరూ సంక్రాంతికి పోటీపడడం ఏంటి.? అనుకుంటున్నారా..? విషయం ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ‘ఎం.సీ.ఏ’ డైరెక్టర్ వేణుశ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వలన సమ్మర్ కి పోస్ట్ పోన్ అయ్యింది.
అయితే… సంక్రాంతికి మాత్రం ‘వకీల్ సాబ్’ టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దీంతో వకీల్ సాబ్ టీజర్ కోసం పవన్ ఫ్యాన్స్ వెయిటింగ్. ఇక టీజర్ రిలీజ్ అయితే.. సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ తో దుమ్ముదులిపేందుకు రెడీగా ఉన్నారు పవన్ అభిమానులు. ఇదిలా ఉంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’. ఈ చిత్రానికి ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సాహో సినిమా నిరాశపరచడంతో ‘రాధేశ్యామ్’ టీజర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ టీజర్ త్వరలో రానుందని.. అభిమానుల ఎదురు చూపులకు తగ్గట్టుగా టీజర్ మీలో ఉత్సాహాన్ని నింపుతుంది అంటూ ట్వీట్ చేశారు. దీంతో ‘రాధేశ్యామ్’ టీజర్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. సంక్రాంతికి ఈ టీజర్ రానుందని సమాచారం. ప్రభాస్ అభిమాలను కూడా ఈ టీజర్ తో సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేయాలని వెయిట్ చేస్తున్నారు.
Also Read ;- ప్రభాస్ ‘రాధేశ్యామ్’ పోస్టర్ అదరహో

అయితే.. ప్రబాస్ మూవీ పాన్ ఇండియా మూవీ కాబట్టి 5 భాషల్లో టీజర్ రిలీజ్ కానుంది. పవన్ ‘వకీల్ సాబ్’ తెలుగులో మాత్రమే రిలీజ్ కానుంది. అందుచేత ఈ రెండు టీజర్ లకు పోటీ పెట్టడం కరెక్ట్ కాదు కానీ.. తెలుగు వరకు ఈ రెండు టీజర్ లకు ఎన్ని వ్యూస్ వస్తాయి? సంక్రాంతికి రానున్న ప్రభాస్ ‘రాధేశ్యామ్’, పవన్ ‘వకీల్ సాబ్’ ఈ రెండు తెలుగు టీజర్లు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయనేది ఆసక్తిగా మారింది. మరి.. ఈ టీజర్ పోటీలో ఏ మూవీ టీజర్ రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Must Read ;- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘వకీల్ సాబ్’ పిక్స్











