ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల పెళ్ళిపనుల్లో హడావిడిగా ఉన్నారు. ఈ నెల 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో గ్రాండ్ గా జరగనుంది వివాహం. దేశంలోనే అత్యంత విలాసవంతమైన ఉదయ్ ప్యాలెస్ లో ముఖ్య సినీ ప్రముఖులు, బంధు మిత్రుల సమక్షంలో కనీవినీ ఎరుగని రీతిలో పెళ్ళి జరిపించడానికి ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ లోని టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అందరికీ మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆహ్వానం అందిందని సమాచారం.
ముఖ్యంగా ఈ పెళ్ళికి నటసింహ బాలకృష్ణను చిరంజీవి స్వయంగా ముఖ్య అతిథిగా ఆహ్వానించారని టాక్. టాలీవుడ్ లోని మిగతా అగ్రహీరోలైన వెంకీ, నాగార్జున లకు కూడా చిరంజీవి ఫోన్ చేసి మరీ పెళ్ళికి ఇన్వైట్ చేశారని సమాచారం. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ పిలుపు మేరకు యంగ్ హీరోలు నితిన్, రానా, నాగచైతన్య లు కూడా పెళ్ళికి తమ ఫ్యామిలీస్ తో రాబోతన్నారని సమాచారం. అలాగే రామ్ పోతినేనికి కూడా వరుణ్ నుంచి ఇన్విటేషన్ వెళ్ళిందట. ఇక దర్శకులు కొరటాల శివ, సుకుమార్, రాజమౌళితో పాటు సీనియర్ దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు తదితరుల్ని కూడా నిహారిక పెళ్లికి విచ్చేస్తున్నారట. అలాగే.. టాలీవుడ్ లోని టాప్ మోస్ట్ నిర్మాతలకు కూడా ఆహ్వానం అందిందట.
ఆచార్య షూటింగ్ కు బ్రేకిచ్చి మరీ మెగాస్టార్ నిహారిక పెళ్ళికి రాబోతున్నారు. అలాగే.. మెగా హీరోలందరూ తమ తమ షూటింగ్స్ కు శెలవు పెట్టి మరీ ఈ వేడుకకు స్పెషల్ అట్రాకన్షన్ కాబోతున్నారట. ఇక మెగా కజిన్స్ అయిన చరణ్, బన్నీ లు సైతం షూటింగ్స్ కు బ్రేకిచ్చి పెళ్ళి వేడుకకు హాజరవనున్నారని టాక్. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే.. ఉదయ్ పూర్ పెళ్ళికి అటెండ్ అయి.. అక్కడ మూడు రోజులుండి హైద్రాబాద్ కు రాబోతున్నారని టాక్. ఈ మెగా వేడుకు బాలయ్య ఏ రేంజ్ లో హైలైట్ అవుతారో చూడాలి.











