టాలివుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య‘ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. అయితే ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. మరల తిరిగి షూటింగ్ ప్రారంభించడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈమధ్యనే తనకి కరోనా పాజిటివ్ వచ్చిందని స్వయంగా చిరంజీవి తెలిపిన విషయం మనకు తెలిసిందే. కాకపోతే కరోనా టెస్టింగ్ కిట్లు సరిగ్గా పనిచేయకపోవడంతో పాజిటివ్ వచ్చిందని అసలు చిరుకి కరోనా సోకలేదని ఇటివలే వైద్యుల బృందం తెలిపింది కూడా.
ఈ విషయం పక్కన పెడితే చిరు ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లో పాల్గొనడం కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం తన మేకోవర్ ను చేంజ్ చేసి అదిరిపోయే లుక్ లోకి వచ్చేసారు చిరంజీవి. ఆయన మేకోవర్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో చిరు చాలా కొత్తగా, స్టన్నింగ్ లుక్స్ తో కనపడుతున్నారు. గ్లామర్ లో యువ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా తమ అభిమాన హీరో ఉన్నాడని మెగా ఫాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
చిరు నయా లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మొట్ట మొదటి తెలుగు ఓటీటీ ఆహాలో స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా ‘సామ్ జామ్’ అనే ఒక ప్రోగ్రాం మొదలైంది. ఇటీవలే ఈ ప్రోగ్రాంకు మెగాస్టార్ చిరంజీవి అతిధిగా హాజరైయ్యారు. ఆ సమయంలోనే చిరు నయా లుక్ ఫొటోస్ బయటకు వచ్చాయని తెలుస్తోంది. చిరంజీవి ‘ఆచార్య’ సినిమా తర్వాత వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా, మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.
Must Read ;- మెగాస్టార్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్న దిల్ రాజు