లాక్డౌన్ ఆన్ లాక్ 4.o లో, జిమ్‌లు తిరిగి ప్రారంభించినప్పటికీ, అనేక మంది ప్రముఖులు, సెలబ్రెటీలు జిమ్ కు వెళ్లకుండా ఇంట్లోనే వర్కవుట్స్ చేస్తున్నారు. అయితే కరోనావైరస్ వ్యాప్తి సమయంలో కూడా నిహారిక కొణిదెల.. జిమ్ లో కసరత్తులను మాత్రం ఆపలేదు. మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక పెళ్ళి త్వరలో జరగనుందనే విషయం తెలిసిందే. ఇటీవల చైతన్య జోన్నలగడ్డతో నిశ్చితార్థం అయ్యింది. అసలు విషయానికి వస్తే నిహారిక, హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి జిమ్ లో తెగ కష్టపడుతుంది. జిమ్ కి సంభందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో .. నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.
రాబోయే రెండు నెలల్లో నిహారిక పెళ్లి ఉండడంతో ఆమె తన శరీర ఆకృతి విషయంలో కేర్ ఫుల్ గా వ్యవహరిస్తోందని చర్చించుకుంటున్నారు. నిహారిక చైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత కొత్త సినిమాలకు సంతకం చేయడం మానేసింది.
నీహారిక “ముద్దపప్పు ఆవకాయ్” లఘు చిత్రం నిర్మించి అందులో నటించింది. ఈ సిరీస్ యూట్యూబ్ లో విశేషంగా ఆకట్టుకుంది. ఆ తరువాత ఆమె ‘ఒక మనసు’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఒక మనసు లో పక్కింటి అమ్మాయి లా మెప్పించి అన్ని రకాల పాత్రలు చేయగలదని నిరూపించుకుంది. నీహారిక నటిగా కంటే ముందు ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ రియాలిటీ షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించింది. ఆమె సినిమాలు మానేస్తుందని ప్రస్తుతం ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది.











