పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ గురించి పవర్ స్టార్ అభిమానులు ఎప్పటి నుంచో వెయిటింగ్. ఇటీవల వకీల్ సాబ్ షూటింగ్లో పవన్ కళ్యాణ్ జాయిన్ కావడంతో ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అనుకున్నారు. ఈ సంవత్సరం సమ్మర్ లో రావాల్సిన వకీల్ సాబ్ వచ్చే సంవత్సరం సంక్రాంతికి రావడం పక్కా అనుకున్నారు. అయితే.. దీపావళికి వకీల్ సాబ్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో మూవీ రిలీజ్ పై అభిమానుల్లో అనుమానం వచ్చింది. వకీల్ సాబ్ సంక్రాంతికి రావడం లేదని.
ఇప్పుడు ఆ.. అనుమానమే నిజం అయ్యిందని సమాచారం. పవన్ ఇటీవల రాజకీయాల్లో బిజీ కావడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో వకీల్ సాబ్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. అయితే.. ఈ క్రేజీ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయాలని దిల్ రాజు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇక మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన సినిమా ఉప్పెన. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.
ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన కృతిశెట్టి నటించింది. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ మూవీలోని పాటలు యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో సినిమా పై పాజిటివ్ టాక్ ఉంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని కూడా ఈ సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. అయితే.. కరోనా కారణంగా ఆగింది. ఆతర్వాత ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్స్ వచ్చినప్పటికీ నో చెప్పారని.. థియేటర్లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారని టాక్. డిసెంబర్ నుంచి సినిమాల విడుదలకు రెడీ అవుండడంతో ఈ మూవీని క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ రిలీజ్ చేస్తారనుకున్నారు.
Must Read ;- వెంకీతో చేయాలనే తన కల నిజమైందంటున్న బ్యూటీ
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. వకీల్ సాబ్ లాగానే ఉప్పెన చిత్రాన్ని కూడా వచ్చే సంవత్సరంలో సమ్మర్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వైష్ణవ్ తేజ్ ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి.. ఓటీటీలో కాకుండా థియేటర్ లోనే రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు థియేటర్ లో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే పర్మిషన్ ఇవ్వడంతో సమ్మర్ టైమ్ కి అంతా సెట్ అవుతుంది అప్పుడు రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.
Also Read ;- ఒకే సినిమాలో పవర్ స్టార్, సూపర్ స్టార్.?