తెలుగు వారినిని ఎంతగానో ఆకట్టుకుని.. దూసుకెళుతున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా. ఇందులో సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు, గేమ్ షోలు, టాక్ షోలు ప్రసారం చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంతతో సామ్ జామ్ అనే టాక్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సామ్ జామ్ షోలో ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, డైరెక్టర్ క్రిష్, దగ్గుబాటి రానా, నాగ్ అశ్విన్ తదితరులను ఇంటర్ వ్యూ చేసింది. సామ్ చేస్తున్న ఈ టాక్ షోకు అనూహ్యమైన స్పందన లభిస్తుంది.
అయితే.. రీసెంట్ గా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ని కూడా సమంత ఇంటర్ వ్యూ చేయడం జరిగింది. ఈ ఇంటర్ వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా తండ్రి అయిన తర్వాత అతనిలో వచ్చిన మార్పు..? అభిమానుల గురించి.. నాన్న గురించి.. ఇలా ఇంట్రస్టింగ్ విషయాలను ఈ షోలో చెప్పడం జరిగింది. ఈ రోజు సాయంత్రం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే.. బన్నీతో చేసిన ఈ టాక్ షోకు సంబంధించి ఆహా ప్రొమో రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రొమోనే ఆహాకు ఇబ్బందులను తెచ్చిందని చెప్పచ్చు.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ ప్రోమో రిలీజ్ చేస్తూ అల్లు అర్జున్ కు మెగాస్టార్ అనే బిరుదు తగిలించడం జరిగింది. అల్లు అర్జున్ ని స్టైలీష్ స్టార్ అంటారు. అలాంటిది మెగాస్టార్ అనడం ఏంటి..? ఇది ఆహా తెలిసి చేసిందా..? లేక అనుకోకుండా పొరపాటు జరిగిందా..? ఏమైందో ఏమో కానీ.. మెగాస్టార్ అల్లు అర్జున్ అనే సరికి మెగా ఫ్యాన్స్ కి కోపం వచ్చింది. అంతే.. ఆహాను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. మెగాస్టార్ ఒక్కరే ఉంటారు చిరంజీవి ఒక్కరే అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. దీంతో ఆహాకు టీమ్ కి చేసిన తప్పు తెలిసింది. దీని పై స్పందిస్తూ.. ఎవరైనా హార్ట్ అయి ఉంటే.. క్షమించండి. ఈ సంవత్సరంలో చివరి రోజు ఇది క్షమించేయండి అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అదీ.. సంగతి.