“కుమారి 21 ఎఫ్” చిత్రం చలువతో హెబ్బాకు బోలెడన్ని అవకాశాలు వచ్చాయి కానీ అవేవీ సక్సెస్ కాలేదు. దాంతో అసలుకే ముప్పు వాటిల్లినట్లు అంతకుముందున్న క్రేజ్ కు కాస్తా గండిపడింది. ముంబైకి చెందిన ఈ భామ ;చాలామంది కోవలోనే మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. ఒకే ఏడాది 2014లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందిన మూడు వేర్వేరు చిత్రాలలో ఆమె హీరోయిన్ గా పరిచయమైంది. ఆలా సినీరంగంలో ఆమె తొలి ఎంట్రీనే విశేషమైంది.
తెలుగులో రాహుల్ రవీంద్రన్ సరసన ఆమె నటించిన తొలి చిత్రం “ఆలా ఎలా” అనుకున్నంతగా ఆడలేదు. అయితే ఆ తర్వాత వచ్చిన “కుమారి 21 ఎఫ్” చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడమే కాదు ఆమె కెరీర్ నుఒక్కసారిగా మలుపు తిప్పింది. ఆ క్రమంలోనే “ఈడో రకం ఆడో రకం, ఎక్కడికిపోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్, మిస్టర్, అందగాడు, ఏంజెల్, 24 కిస్సెస్” తదితర చిత్రాలు చేసినప్పటికీ ఆ చిత్రాలపై ఆమె పెట్టుకున్న నమ్మకం వమ్మయ్యింది. ఈ నేపథ్యంలో చిత్రాలు తగ్గుతూ వచ్చాయి. హెబ్బాకు ఉన్న ప్లస్ పాయింట్ గ్లామర్ అని చెబుతారు.
తాజాగా ఆమె నటించిన చిత్రం “ఒరేయ్ బుజ్జిగా”. రాజ్ తరుణ్ సరసన ఇందులో ఒక హీరోయిన్ గా నటించింది. రాజ్ తరుణ్ సరసన ఆమె నటించడం ఇది నాలుగోసారి. ఇప్పటికే ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాగా త్వరలో థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. థియేటర్లలో దీని ఫలితం ఏంటన్నది స్పష్టంగా తేలనుంది. ఇక “రెడ్” చిత్రంలో “డించక్ డించక్’’ అనే మాస్ ఐటెం సాంగ్ లో హీరో రామ్ తో పాటు నర్తించింది. ఈ సినిమాలైనా తనకు విజయాన్ని అందించి మునుపటి క్రేజ్ ను తెచ్చిపెడతాయని హెబ్బా కోటి ఆశలతో ఉంది.