నందమూరి తారాకరామారావు గారి పుట్టిన రోజు సందర్బంగా ప్రతి ఏడాది మే 27- 28 తేదీలలో తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు తెలుగుదేశం పార్టీ నాయకులకు,కార్యకర్తలకు,అభిమానులకు అతిపెద్ద పండుగ అని చెప్పాలి.ఈ సారి ఎన్ టి ఆర్ శత జయంతి ఉత్సవాలను రాష్ట్రంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం గర్వకారణం. ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవ పరిరక్షణ,అభివృద్ధి సాధన,అవినీతి,పేదరిక నిర్ములన, దుష్పరి పాలనను దనుమాడటమే లక్ష్యాలుగా తెలుగుదేశం పార్టీని 41 ఏళ్ల నాడు నెలకొల్పారు. ఆయన తరువాత నారా చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఎన్ఠీఆర్ ఆశయాలకు అనుగుణంగా,మానవతా వాదాన్ని మతంగా మార్చుకొని. దుష్పరిపాలకుల పాలన పై దండెత్తుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అవిరళ కృషి చేస్తున్నారు. 41 ఏళ్లుగా తెలుగుదేశం ప్రస్తానం ఎన్నో ఆటుపోట్లు,ఎన్నో సంక్షోభాలు,కుట్రలు, కుతంత్రాలు,తట్టుకొని సమున్నతంగా నిలబడిన తెలుగుదేశం పార్టీని అంత మోందించడానికి చెయ్యని కుట్రలు,కుయుక్తులు లేవు. సంక్షోభం ఎదురైనప్పుడల్లా రెట్టింపు బలంతో ప్రజలకు చేరువై బలపడిందే తప్ప కుట్రలకు,కుమ్మక్కులకు, సంక్షోభాలకు అదరని,బెదరని పార్టీ . ఒక రాజకీయ పార్టీకి ఎన్ని గడ్డు పరిస్థితులు రాకూడదో అన్ని గడ్డు పరిస్థితులు వచ్చినా నిలదొక్కుకున్న పార్టీ. ఆ పార్టీని ఫినిష్ చేస్తానన్న వారు ఫినిష్ అయ్యారు తప్ప తెలుగుదేశానికి ఏమి కాలేదు. పదవుల కోసం,అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నా,లేకున్నా ప్రజల నిర్వహిస్తున్న భాధ్యాత గురుతర మైనది. ఆవిర్భావం నుండి బడుగు,బలహీన వర్గాలకు నీడనిస్తున్న పార్టీ.పెత్తందారీ పాలనకు ముగింపు పలికి రాజకీయ ప్రజాస్వామ్యానికి శ్రీకారం చుట్టిన ఘనత తెలుగు దేశానిదే. ఓటమి కూడా పార్టీకి కొత్త ఏమి కాదు.పార్టీ ఆవిర్భావం నుండి అనేక మంది నాయకులు యోధాన,యోధులు పార్టీని వీడినా అదరని,బెదరని పార్టీ. విభజన అనంతరం దిక్కూ,మొక్కూ లేకుండా అచేతనంగా నిలిచిన రాష్ట్రానికి ఐదేళ్లలో రెక్కలు,ముక్కలు చేసుకొని దిశ,దశ కల్పించి రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాదులు వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. పడగొట్టిన రాష్ట్రాన్ని పడకుండా భుజం కాచిన నాయకుడు చంద్రబాబు.
సిద్దాంత పరంగా పార్టీకి ఎన్ఠీఆర్ వేసిన పునాదులు బలంగా వున్నాయి. శ్రమ జీవుల కష్టాన్ని గుర్తించి వారి అభివృద్ధి కై తపించి బూజుపట్టిన బూర్జువా వ్యవస్థలను రూపు మాఫీ విప్లవాత్మక విధానాలను పరిపాలనా రంగంలో పాదు గొల్పి సమ సమాజం కోసం పాటుపడిన పార్టీ . తెలుగుదేశం పార్టీకి దెశ వ్యాప్త గుర్తింపు ఉంది. రాష్ట్ర ప్రతిష్టను జాతీయంగానే కాక అంతర్జాతీయంగా ఇనుమడింపజేసి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి నిరంతరం కృషి చేసిన పార్టీ. సమర్ధవంత మైన,ఆదర్సవంత మైన పాలన అందించి రాష్ట్రాభివృద్ధికి అంకిత భావంతో అహర్నిశలు పాటుపడ్డ పార్టీ. అధికారంలో వున్నా,లేకున్నా ప్రజా సేవలో ముందుండి ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషిచేసిందే తప్ప అధికారాన్ని స్వార్ధ ప్రయోజనాలకు ఉపయోగించుకోలేదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం పై విషం కక్కి,ప్రజలకు అబద్దాలు చెప్పి ప్రజలను బురిడీ కొట్టించి అధికారం లోకి వచ్చిన వారు జన జీవితాలను కబళించారు,రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కోటలు దాటే మాటలు,గడప దాటని చేతలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు.నేటి జగన్ రెడ్డి దగా రాజకీయాలపై ధ్వజమెత్తాలి. రాజకీయ ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టి ఎప్పటికప్పుడు ప్రతి వ్యూహాలు రచించుకోవాలి.పార్టీపై,అధినేత పై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్ని పార్టీకి దూరం చేస్తున్న విధానాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టాలి . పార్టీ ఎప్పుడు సంక్షోభం లో పడినా రెట్టింపు ఉత్సాహంతో పార్టీని ముందుకు నడిపిన చరిత్ర అధినేత చంద్రబాబుది. తెలుగుదేశం పార్టీ తన 22 ఏళ్ల పరి పాలనలో ప్రజలకు,రాష్ట్రానికి మేలుచేసిందే తప్ప స్వార్ధ ప్రయోజనాలకోసం కీడు చెయ్యలేదు. అభివృద్ధి కి, ప్రజా సంక్షేమానికి ప్రణాళికలు వేసిందే తప్ప అవినీతికి ప్రణాళికలు వెయ్యలేదు. రాష్ట్రానికి కీడు చేసినవారు,లూటిచేసినవారు ఆంధ్రప్రదేశ్ అంటే అంతా మోసం,దగా అన్న భావన ప్రపంచమంతా కల్పించిన వారు నీతులు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని, ప్రజల్ని చరిత్ర ఎరుగని సంక్షోభంలోకి, సమాజం ఎరుగని భాదల్లోకి నెట్టారు. కావునా తెలుగు తమ్ముళ్లు జనంలో ఉండి దమన పాలకుల దమన కాండ పై ధ్వజమెత్తాలి.విభజన అనంతరం అనాధగా మారిన ఆంధ్రప్రదేశ్ ని కర్తవ్య దీక్ష,మూర్తీభవించిన సమర్ధ నాయకత్వమే అన్ని రంగాల్లోనూ అగ్రభాగాన నిలిపింది. ఫీకల్లోతు కష్టాల్లోనూ నిర్దిష్ట లక్ష్యాలు నిర్దేశించుకొని ప్రణాళికా బద్దంగా రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాదులు వేసింది.తెలుగు పార్టీని దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలపై తెలుగు తమ్ముళ్లు తిరగబడాలి. కుటిల రాజకీయాలకు సమాధికట్టాలి. తెలుగు తమ్ముళ్లు మరింత క్రియాశీలంగా వ్యవహరించాలి. నిరాశ,నిస్పృహ, నిర్లక్ష్యం విడనాడాలి.బూటకపు హామీలతో జనాన్ని బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన వారి దగా పరిపాలన పై ధ్వజమేత్తాలి,
నాయకులు,కార్యకర్తలు దృక్పధంలో మార్పు తెచ్చుకోవాలి. దృష్టిని లక్ష్యం వైపు మల్లించాలి. పయనం గమ్యం వైపు సాగిపోవాలి. మధ్యలో ఎదురయ్యే సమస్యల్ని ఎదిరించాలి. తిరిగి తెలుగు దేశం పార్టీ కి పూర్వ వైభవం తేవడానికి అరమరికలు లేకుండా మహానాడులో చర్చించి సమగ్ర కార్యాచరణ కు రూపకల్పన జరగాలి . జనం ఆకాంక్షలకు తగిన విధంగా భవిష్యత్ సవాళ్లకు దీటుగా పార్టీని సంసిద్ధం చేయాలి . ప్రతి నాయకుడు,కార్యకర్త ముందు బేలతనం వీడాలి. ఒక పక్కన ప్రతీకార రాజకీయం రాజ్యమేలుతుంటే తెలుగుదేశం పార్టీ పాత రోజుల్లో వలే మడి గట్టుకొని రాజకీయం చేస్తే పార్టీని బతకనియ్యరు ప్రస్తుత పాలకులు. తెలుగుదేశం పార్టీ అంటే భయం లేకపోవడం వల్లనే వేధింపులతో బెదరగొడుతున్నారు. అనేకమంది ముఖ్యమంత్రులను,ప్రధానమంత్రులను ఢీ కొన్న పార్టీ. తెలుగు దేశం శ్రేణులు ప్రజల్లో అధినేత ప్రతిష్టను పెంచడానికి కృషి జరగాలి 1995 -1999 మధ్య అటువంటి కృషి జరగడం వల్లే 1999 లో తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చిoది. అధినేత కీర్తి ఆకాశమెత్తున ఉండాలి.ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్యామిలీ ఆగ్రా వెళ్లారు. అక్కడ తాజ్ మహల్ వద్ద ఒంటె బండి ఎక్కారు.ఆ బండిని నడుపుతున్న కుర్రవాడు ఆఫ్ కహా సే ఆయే అని అడగగా విజయవాడ అంటూ ఆ దంపతులు చెప్పగా,అవునా చంద్రబాబు నాయుడు అచ్చా అని ఆ కుర్రాడు ఉత్సాహంగా వారి వైపు ఆనందంతో చూసాడు. ఆచ్చర్యం ఏమిటంటే అప్పుడు చంద్రబాబు సియంగా కూడా లేరు. ఉత్తరాదిలో ఓ చిన్న పిల్లవాడికి సైతం ఆంధ్రప్రదేశ్ అనగానే చంద్రబాబు గుర్తుకు రావడం అంటే రాష్ట్ర అభివృద్ధి పై ఆయన వేసిన అభివృద్ధి ముద్ర అని చెప్పాలి.దార్శనికతతో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపి గుర్తింపు,కీర్తి పతాకాన్ని దెశ,విదేశాలకు చేర్చిన నాయకుడు చంద్రబాబు. అటువంటి నాయకుడు పార్టీకి అధ్యక్షుడుగా ఉండటం ఎంతో గర్వకారణం. నాలుగు దశాబ్దాలకు పైగా సాగుతున్న తెలుగుదేశం సుదీర్ఘ రాజకీయ ప్రస్తానం లో ఎదురైన ఎన్నో ఒడిదుడుకులను, కష్ట,నష్టాలను అధిగమించ గలిగిన పార్టీ. తప్పొప్పులను విశ్లేషించుకుని పార్టీ పునాదిని మరింత పటిష్టం చెయ్యాలి. పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తామంటూ చేస్తున్న వాగ్దానాలకు వాస్తవం రూపం ఇవ్వాలి.నియోజక వర్గాల్లో నాయకుల మధ్య నెలకొన్న వైష్యమ్యాలు అరికట్టాలి. పార్టీ పురోభివృద్ధికి వర్గ వైష్యమ్యాలు ప్రతి భంధకంగా మారిన విషయాన్ని గుర్తించాలి. కొన్ని విషయాల్లో అధినేత మొహమాటం వీడి పార్టీకి నష్టం జరుగుతున్నఅంశాలను గుర్తించి ముక్కుసూటిగా వ్యహరించాలి. కావునా కష్టాల్లో వున్న పార్టీని అందరూ కలసి కాపాడు కోవాల్సి ఉంది. జగన్ రెడ్డి దుష్పరిపాలన పై దండెత్తడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు దృష్టి పెట్టాలి. పార్టీ ఒక మహా వృక్షం. ఆ చెట్టు పచ్చగా ఉంటేనే కొమ్మలు,రెమ్మలు విస్తరించి ఆ చెట్టు ఎందరికో చల్లని నీడనిస్తుంది. కావున ఆ భావన ప్రతి నాయకుడి లో, కార్యకర్తలో ఉన్నప్పుడే పార్టీ పచ్చగా కళకళలాడుతుంది.
రాష్ట్రాన్ని పాలించేవారు సమర్ధత లేని,బలహీనులు,అరాచకులు అయితే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో,రాష్ట్రం ఏ విధంగా నష్టపోవాల్సి వస్తుందో ప్రజలకు వివరించాలి. స్వార్ధ రాజకీయ శక్తుల కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం తెలుగుతమ్ముళ్ల పై బలంగా ఉంది.ప్రభుత్వ అసమర్థ,ప్రజావ్యతిరేక విధానాల పై ఉద్యమాలు చేస్తూనే,మరో వైపు వివిధ కారణాలవల్ల పార్టీకి దూరమైన వర్గాలను దగ్గరకు చేర్చుకొనే ప్రయత్నాలు ముమ్మరం చెయ్యాలి. నవ్యాoధ్ర నలుచెరుగు లా అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. అట్లని జగన్ రెడ్డి పాలనా వైఫల్యాల పై ఆధారపడి పార్టీ బలపడి నట్లు భావించడం మంచిది కాదు. వైకాపా ప్రభుత్వ అసమర్ధ,అవినీతి,నిరంకుశ పరిపాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంధకారమైంది. గత అయిదేళ్ళు అభివృద్ధి పధంలో దూసుకు పోయి న ఆంధ్రప్రదేశ్ జగన్ అసమర్ధ పాలనలో30 ఏళ్ళు వెనక్కి నెట్టబడింది. ఈ విపత్కర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ,నాయకులు,కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కొరకు అందరూ కార్యో న్ముఖులు కావాలి. అందుకు పార్టీని,రాష్ట్రాన్ని,ప్రజలను కాపాడుకొనేందుకు రాజమండ్రిలో జరుగుతున్నమహానాడు వేదికగా తెలుగుతమ్ముళ్లు పిడికిలి బిగించి ప్రతిన పూనాలి.