రాజమహేంద్రవరంలో పోటెత్తిన టిడిపి శ్రేణులు భవిష్యత్తుకు గ్యారంటీగా మహాశక్తి, యువళం,అన్నదాత.. ఇంటింటికీ నీళ్లు, బీసిల రక్షణ చట్టం, పూర్ టు రిచ్.. చంద్రబాబు సిక్సర్ తో జగన్మోహన్ రెడ్డి క్లీన్ బౌల్డ్.. మండుటెండల్లో ప్రారంభమైందీ మహానాడు..జోరువానలో ముగిసింది..మండే ఎండ, జోరువాన లెక్కచేయని తెలుగుదేశం సైన్యం కదం తొక్కడం చూశాం..గోదావరి వంతెనలపైనే కాదు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలనుంచి వెల్లువెత్తిన పసుపు ప్రభంజనం చూశాం, జనసునామీ పోటెత్తింది రాజమహేంద్రవరానికి..అడుగడుగునా ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఆర్టీసి బస్సులివ్వకపోయినా, స్కూలు బస్సులిస్తే కేసులు పెడ్తామని బెదిరించినా, ప్రైవేట్ వాహనాలను ఎక్కడికక్కడ ఆపేసినా, ఇంతపెద్దఎత్తున లక్షలాది జనం పరవళ్లు తొక్కడం, సంస్థాగతంగా టిడిపి బలానికి అద్దంపట్టింది. 42ఏళ్ల తెలుగుదేశం, 100ఏళ్ల ఎన్టీఆర్, శకపురుషుని శతజయంతి మహానాడుగా చరిత్రలో ఈ మహానాడు నిలిచిపోతుంది. నవతరం నాడుగా రాజమహేంద్రవరం మహానాడు మరోచరిత్రకు నాంది పలికింది..సీనియర్లకు బొకేలిచ్చి ముందు కూర్చోపెట్టి, వెనుకుండి చక్రం తిప్పింది యువతరమే..వ్యవసాయం, సంక్షేమం, శాంతిభద్రతలు తదితర అంశాలపై తీర్మానాలన్నీ బలపర్చింది యువతరమే. చింతకాయల విజయ్, మహాసేన రాజేశ్, తేజస్విని, తదితర కొత్తతరం నాయకుల ప్రసంగాలు ఈ మహానాడుకే హైలెట్.. యువగళం పాదయాత్రకు 3రోజులు బ్రేక్ ఇచ్చి మహానాడుకు హాజరైన నారా లోకేశ్ ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు టిడిపి శ్రేణులేగాకుండా నాయకులు పోటీబడటం విశేషం..పేరుపేరునా వారందరినీ పలకరించి వేదికపై పిడికిలి బిగించి తనదైన శైలిలో నినాదాలు చేయడం సభికుల్లో ఉత్సాహాన్ని ఉరకలెత్తించింది. లోకేశ్ ప్రసంగంలో కసి కనిపించింది, ఒక తెగింపు కనిపించింది.. జగన్ ను ఓడించాలనే కసి, వైసిపి ఢీకొట్టాలనే తెగింపు, టిడిపిని గెలిపించాలనే కసి, లోకేశ్ ప్రసంగంలో కనిపించింది. పాదయాత్రతో పరిణతి చెందిన నాయకుడిగా లోకేశ్ ఎదిగాడు, పవర్ ఫుల్ గా మారాడు, పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చాడు. ఒక ఫీల్ కనిపించింది లోకేశ్ స్పీచ్ లో, పాదయాత్రలో అతని ఫీల్, స్వయంగా తాను చూసిన ప్రజల కష్టాలు ఆ ఫీల్ కనబడింది ఆయన ప్రసంగంలో.. 42ఏళ్లలో టిడిపి ఎదుర్కొన్న సంక్షోభాలన్నీ ఒక ఎత్తు, ప్రస్తుత సంక్షోభం ఇంకో ఎత్తు..కనీవినీ ఎరుగని రీతిలో అణిచివేతను ఎదుర్కొందీ 4ఏళ్లలో.. తెలుగుదేశం పార్టీ ఒక బంతిలాంటిది..ఎంత బలంగా కొడితే అంత ఎత్తుకు లెగుస్తుంది.. 42ఏళ్ల చరిత్రచూస్తే అర్ధమయ్యేదదే..ఏడాదిన్నర బిడ్డగా ఉన్నప్పుడే చూశాం, నాదెండ్ల సంక్షోభం నుంచి ఎంత బలంగా ఎదిగిందో, వటవృక్షంగా మారిందో..అదేవిధంగా వైస్రాయ్ సంక్షోభం కూడా..మహూర్తబలం అలాంటిది..ఏ మహూర్తాన ఎన్టీఆర్ ఈ పార్టీని పెట్టారో మహూర్త బలం అలాంటిది. నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో అణిచివేతకు గురైంది తెలుగుదేశం. డజన్ల సంఖ్యలో కార్యకర్తల హత్యలు, వేలాది మందిపై తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు, ఇంత దమనకాండ గతంలో ఏపార్టీపైనా లేదు. అణిచివేత పెరిగినప్పుడల్లా రెట్టింపు బలంతో తెలుగుదేశం పుంజుకోవడం, గతంకన్నా బలోపేతం కావడం గత చరిత్ర చూశాం. ఇప్పుడీ నిర్బంధకాండ, అణిచివేత నేపథ్యంలో జరిగిన రాజమహేంద్రవరం మహానాడు టిడిపి శ్రేణులకే స్ఫూర్తిదాయకం కానుంది. మహానాడంటే తెలుగుదేశం పార్టీకి గుండెలాంటిది. ఒక ఎనర్జీ పంపింగ్ స్టేషన్..హృదయ కవాటం..కార్యకర్తల్లో, నాయకుల్లో రెట్టింపు ఉత్సాహం నింపే వేదిక..తొలి మహానాడు నుంచీ ఈ 32వ మహానాడు దాకా అదేచూశాం.. సంస్థాగత బలమే టిడిపి కి శ్రీరామరక్ష..లక్షలాది కార్యకర్తలు పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. మరేపార్టీకి లేని సంస్థాగత బలం టిడిపి సొత్తు. ఈ ఎన్నికల ఏడాదిలో ముఖ్యంగా 2 అంశాలు టిడిపి జోష్ ను బాగా పెంచాయి..1) ఎన్టీఆర్ శతజయంతి రావడం..దేశవిదేశాల్లో అద్భుతంగా 100సభలు జరపడం పార్టీలో ఎనలేని జోష్ నింపింది. 2) యువగళం లోకేశ్ పాదయాత్ర రాయలసీమలో దుమ్ము రేపుతోంది, గ్రవుండ్ లెవల్లో కేడర్ ఉత్సాహాన్ని డబుల్ ట్రిపుల్ చేసింది. వాటికి సమాంతరంగా రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు సభలు, పార్టీ ఆందోళనా కార్యక్రమాలు ఈ జోష్ ను మరింత పెంచాయి.. ‘‘బాదుడేబాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి’’ కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు దోహదపడ్డాయి..ఏ రెండు కేసులైతే (వివేకా హత్య కేసు, కోడికత్తి కేసు) 2019లో టిడిపిని ఓడించాయో, అవే రాబోయే ఎన్నికల్లో గెలుపు అస్త్రాలుగా మారాయి.. తెలుగుదేశంలో ఒక ఫాషన్ తో పనిచేస్తారు ప్రతి కార్యకర్త, నాయకుడు..తరతమ భేదం మరిచి పనిచేస్తారు..మహానాడు వచ్చిందంటే వాళ్లింట్లో శుభకార్యం వచ్చినట్లే చేస్తారు.. మహానాడు నిర్వహణకు నాయకుల కమిటీలన్నీ ఒక ఎత్తయితే పసుపుదండు, కార్యకర్తల పనితీరు మరో ఎత్తు..నగరంలో ఏర్పాట్లు, స్టేజి అలంకరణ నుంచి, కార్యకర్తల రిజిస్ట్రేషన్, భోజనాల ఏర్పాట్లనుంచి చివరిరోజు ముగింపు సభ వరకు వాలంటర్లు వాళ్లే, డెకరేటర్లు వాళ్లే, వాటర్ బాయ్స్ వాళ్లే, సర్వర్లు వాళ్లే, క్లీనర్లు వాళ్లే, సొంతింట్లో శుభకార్యంలో పాల్గొన్నట్లు పార్టీ మహానాడులో పాల్గొంటారీ పసుపుదండు..రాజమహేంద్రవరం మహానాడు కూడా అంతే, అదో విజయోత్సవ మహానాడుగా జరిపారు. అంతులేని ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది దేశం శ్రేణుల్లో, పెద్దఎత్తున బాణసంచా పేలుళ్లతో ప్రాంగణం ప్రతిధ్వనించింది, రాబోయే మహానాడు ఇంతకన్నా ఘనంగా అధికార పార్టీగా జరుపుతామన్న అధినేత మాటలే వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేసింది. చంద్రబాబు ప్రసంగంలో ఇచ్చిన కాల్ చూస్తే,‘‘నౌ ఆర్ నెవర్’’ అన్నారు..1983వరల్డ్ కప్ లో కపిల్ దేవ్ టీమ్ స్లోగన్ ‘‘నెవర్ గిపప్’’ కాల్ గుర్తొస్తుంది..ఎప్పుడో యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికలో ఒబామా ఇచ్చిన పిలుపు ‘‘యస్ ఉయ్ కెన్’’ గుర్తొస్తోంది..విజయమో వీర స్వర్గమో అన్నట్లు జగన్మోహన్ రెడ్డితో ఢీకొట్టేందుకు, వైసిపితో అమీతుమీకి తలపడేందుకు చంద్రబాబు పిలుపు సంసిద్ధం చేసింది. పార్టీ అధినేత చంద్రబాబు నుండి, యువనేత నారా లోకేశ్, నటసింహం నందమూరి బాలకృష్ణ మొదలుకుని ప్రతి వక్త ప్రసంగంలో ‘‘దేశలోనే సంపన్న సీఎం జగన్, పేద రాష్ట్రం, పేద ప్రజానీకం’’ అనేది బలంగా తీసుకెళ్లారు ఈ మహానాడు ద్వారా.. ‘‘రూ లక్ష చెప్పులేసుకునేవాడు పేదోడా, రూ 1000బాటిల్ వాటర్ తాగేవాడు పేదోడా, వందల కోట్ల ప్యాలెస్ లలో ఉండేవాడు పేదోడా’’ అంటూ సాగిన లోకేశ్ ప్రసంగం ఆలోచింపజేసింది. ఈ ఎన్నికను ‘‘పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధంగా’’ ఒక పెత్తందారైన జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం అపహాస్యం పాలైంది..తన మాయమాటలతో పేదలను టిడిపిపైకి ఉసిగొల్పి రాజకీయ లాభాలు పొందాలనే కుట్ర ఆరంభంలోనే భగ్నమైంది.. ఎవరూ ఊహించని రీతిలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తొలిదశను ఈ వేదికపై నుంచే చంద్రబాబు ప్రకటించించడం సంచలనమైంది, జగన్మోహన్ రెడ్డిని బెంబేలెత్తించింది, వైసిపి గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది.. ఫస్ట్ ఫేజే ఇలా ఉంటే దసరాకొచ్చే ఫుల్ మేనిఫెస్టో ఇంకెలాగుంటుందో..? అనేదానిపైనే సర్వత్రా చర్చోపచర్చలు.. గేమ్ ఛేంజర్ మేనిఫెస్టోగా భావిస్తున్నారు దీన్ని…..‘‘భవిష్యత్తుకు గ్యారంటీ’’ పేరుతో చంద్రబాబు ప్రకటించిన 6అంశాలు సూపర్ సిక్స్ గా మారాయి, ఇక విన్నింగ్ స్ట్రోకే మిగిలింది.. 1). ‘‘మహాశక్తి’’ పథకం ఆంధప్రదేశ్ ఆడబిడ్డలకు చంద్రన్న వరమే.. ‘‘ఆడబిడ్డకు నిధి’’ కింద 18ఏళ్లు దాటిన ప్రతి పేద మహిళకు ప్రతి నెలా రూ 1500 నేరుగా ఖాతాలో జమచేస్తే ఆయా కుటుంబాలకు వేణ్ణీళ్లకు చన్నీళ్లు తోడే..గత 4ఏళ్ల జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలనతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ 40లక్షల అసంఘటిత కార్మిక కుటుంబాల మహిళలకు ‘‘మహాశక్తి’’ పథకం పెద్ద ఊరటే.. ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికీ నేరుగా వాళ్ల ఖాతాల్లోనే జమ చేస్తామనడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.. ‘‘తల్లికి వందనం’’ కింద ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఏడాదికి రూ 15వేలు (నలుగురుంటే నలుగురికి).. ఇద్దరుకుంటే ఎక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధన ఎత్తివేత నిర్ణయం మరో విప్లవాత్మక చర్య, ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టింది.. ‘‘ఆర్టీసి బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం’’ తోబుట్టువులకు నిజంగా చంద్రబాబు కానుకే.. గత 4ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ‘‘బాదుడేబాదుడు’’ పన్నులవాత, చుక్కలనంటిన నిత్యావసర ధరలతో తల్లడిల్లే పేదింటి ఆడబిడ్డలందరికీ ఎనలేని ఉపశమనం కల్పించిందీ ప్రకటన..ఇప్పటికే మున్నెన్నడూలేని స్థాయిలో ఆర్టీసీ ఛార్జీల పెంపుతో రూ 2వేల కోట్ల భారంపడి తల్లడిల్లే పేద కుటుంబాలకిది గొప్ప ఊరటే.. ‘‘దీపం పథకం కింద ఏడాదికి 3ఉచిత సిలిండర్లు’’ అయితే ఈ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. గ్యాస్ సిలిండర్ పై రాయితీ ఎత్తివేసి వంటింట్లో మంట పుట్టించిన నేపథ్యంలో 3గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం ప్రతి పేదకుటుంబానికి పెద్ద ఉపశమనం. ఒక సిలిండర్ 2నెలలు వస్తుందనుకున్నా ఈ 3సిలిండర్లతో 6నెలలు గడిచిపోతుందనే ధీమా ప్రతి ఆడబిడ్డలో కనిపిస్తోంది. కట్టెలపొయ్యితో తనతల్లి పడ్డ ఇబ్బందులే తల్లి రాష్ట్రంలో పడకూడదనే దీపం పథకాన్ని గతంలో పెద్దఎత్తున అమలుచేసిన చంద్రబాబుపై ఆడబిడ్డలందరికీ కొండంత నమ్మకం. అలాంటిది ఇప్పుడీ 3సిలిండర్లు ఉచితంగా ఇస్తే అంతకన్నా పేదలనెత్తిన పాలు పొయ్యడం ఏముంటుంది.. 2) ‘‘యువగళం’’ పథకం కింద 5ఏళ్లలో 20లక్షల మందికి ఉద్యోగాలు నిరుద్యోగులకు ఎడారిలో ఒయాసిస్సే.. పట్టభద్రుల్లో నిరుద్యోగిత 35%ఉందని ఇప్పటికే కేంద్ర సంస్థల నివేదికల నేపథ్యంలో ఈ పథకం ప్రతి యువతి, యువకుడికి భవిష్యత్ పై ఎనలేని భరోసా..ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని నమ్మించి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకతతో మండిపడుతున్న యువతీయువకుల్లో భవిష్యత్ పై భరోసా పెంచిందీ పథకం..జగన్మోహన్ రెడ్డి బెదిరించి రాష్ట్రంనుంచి తరిమేసిన పారిశ్రామికవేత్తలను మళ్లీ ఏపికి రప్పించే సామర్ధ్యం చంద్రబాబుకే ఉందని, పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చగలరని, గతంలో ఏవిధంగానైతే హైదరాబాద్ ను ఎంప్లాయిమెంట్ హబ్ గా చేశారో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ను కూడా మార్చుతారనే విశ్వాసం వారిలో ఉంది. ఈ నేపథ్యంలోనే ‘‘జాబు కావాలంటే బాబు రావాలి’’ అనే నినాదమే మళ్లీ ప్రతిచోటా ప్రతిధ్వనిస్తోంది. ‘‘నెలకు రూ 3వేలు నిరుద్యోగ భృతి’’ మరో ఊరట, యువతరానికి గొప్ప ఆసరా..ఉద్యోగాల కోసం పోస్టల్ ఆర్డర్ డబ్బులు కూడా తల్లినో, తండ్రినో అడగలేక ఇబ్బంది పడే ప్రతి యువతి, యువకుడిలో ఆత్మవిశ్వాసం పెంచే పథకం..గతంలో టిడిపి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడింది. కొత్తగా మరో స్కీము పెట్టకపోగా, ఉన్న స్కీమును రద్దుచేసి లక్షలాది యువతీయువకుల ఆశలను వమ్ముచేసిన జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడెప్పుడు తగిన గుణపాఠం చెబుదామా అని ఎదురుచూస్తున్న యువతరానికిది బ్రహ్మాస్త్రమే.. 3) ‘‘అన్నదాత’’..ఏడాదికి పెట్టుబడి సాయంగా రూ 20వేలు అందిస్తామన్న హామీ రైతన్నల్లో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని, భవిష్యత్ పై భరోసానిచ్చింది. గత 4ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన మోసపు వాగ్దానాలతో మనోనిబ్బరం కోల్పోయి ఆత్మహత్యలే శరణ్యమని భావించే రైతన్నలకు, రైతుకూలీలకిది సంజీవని..అటు పంటబీమా, ఇటు ఇన్ పుట్ సబ్సిడీ కోల్పోయి, విపత్తు సాయం లేక, మద్దతు ధర లభించక నిర్వేదంతో ఉన్న రైతాంగానికి చంద్రన్నవరమే ‘‘అన్నదాత’’.. 4) ‘‘ఇంటింటికీ నీళ్లు’’ రాష్ట్రంలో ప్రతి పేదింట పాలిట సుజల ధారే, అమృతధారే…నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి అసమర్ధ, అవినీతి పాలనతో దేశంలో తాగునీటి సరఫరాలో ఏపి 14వ స్థానానికి పడిపోయిన నేపథ్యంలో ఈ ప్రకటన ఎడారిలో ఒయాసిస్సే.. గతంలో టిడిపి ప్రభుత్వం ప్రారంభించిన ‘‘ఎన్టీఆర్ సుజల’’ పథకాలన్నీ పాడుబెట్టిన పాపం జగన్మోహన్ రెడ్డిని తరిమికొట్టడం తథ్యం..చంద్రబాబు కట్టిన వాటర్ ట్యాంకులకు వైసిపి బులుగు రంగులేసిన మోసగాడు జగన్ అనేది జనం అందరికీ తెలిసిపోయిన నేపథ్యంలో, పల్లెల్లో, పట్టణాల్లో ‘‘ఇంటింటికీ నీళ్లు’’ అందిస్తే అది చంద్రబాబు ఘనతే.. 5) ‘‘ బీసిలకు రక్షణ పథకం’’ మరో విప్లవాత్మక నిర్ణయం..రాజమహేంద్రవరం టిడిపి మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన పథకం బీసీల పాలిట కల్పతరువే..ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తరహాలో, బీసీల రక్షణ పథకం వస్తే రాష్ట్రంలో ప్రతి బీసి కుటుంబానికి అంతకన్నా భద్రత మరేం ఉంటుంది..జగనాసురుడి 4ఏళ్ల పాలనలో 29మంది బీసీలను కిరాతకంగా హత్యచేశారు. 2900మంది బీసిలపై తప్పుడు కేసులు పెట్టారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటి బీసి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బడుగు బలహీన వర్గాలపై జరిగిన దమనకాండకు వ్యతిరేకంగా ఎప్పుడెప్పుడీ వైసిపి రాక్షసుల భరతం పట్టాలా అని బీసిలంతా ఎదురెదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ‘‘బీసిల రక్షణ పథకం’’ ప్రకటించడం వారిలో ఎనలేని భరోసా కల్పిస్తోంది.. 6). ‘‘పూర్ టు రిచ్’’ పథకం…పేదలను ధనికులుగా చేయడమే తెలుగుదేశం లక్ష్యంగా ప్రకటించడం పేదలందరిపై పన్నీటిజల్లే..‘‘పి 4’’(పీపుల్, పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్) కాన్సెప్ట్ ఇచ్చిన పేదల పాలిట పెన్నిధి చంద్రబాబు..ప్రతి ఒక్కరూ మరొకరిని పేదరికం నుంచి బైటపడేయాలన్న చంద్రబాబు సందేశం పేదలపాలిట కల్పతరువే..‘‘పేదరికంపై గెలుపే’’ లక్ష్యంగా గతంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన అన్నా కేంటిన్లు, చంద్రన్న బీమా, పండుగ కానుకలు, పెళ్లికానుకలు ఆదరణ తదితర 89 స్కీముల(బీసి 30, ఎస్సీ 27, ఎస్టీ 16, ముస్లిం మైనార్టీ 10)ను రద్దుచేసిన పాపం జగన్మోహన్ రెడ్డిదే..రాబోయే ఎన్నికలు ‘‘పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధమని’’ ఒక పెత్తందారైన జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం అపహాస్యం పాలైన నేపథ్యంలో చంద్రబాబు ప్రకటించిన పూర్ టు రిచ్, పి4 (పీపుల్, పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్)పాలసీలపైనే ప్రతి పేదకుటుంబం గంపెడాశతో ఎదురుచూస్తోంది.
వర్రా రవీందర్ రెడ్డి రివర్స్ గేర్… సజ్జల గుండెల్లో వణుకు..!
తన దాకా వస్తే గానీ... ఆ కష్టమేమిటన్నది తెలియదట. పోలీసులకు పట్టుబడనంతవరకు భయం...