ఇండియన్ వెబ్ సిరీస్ కేటగిరిలో ఎన్నో అద్భుతమైన స్టోరీస్ కు విశేషాదరణ ఉంది. వాటిలో అందరూ ఎక్కువగా ఇష్డపడుతున్న యాక్షన్ డ్రామా ‘మీర్జాపూర్’. మొదటి సీజన్ ను భాషలకతీతంగా ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు రెండో సీజన్ కు కూడా అదే స్థాయిలో ఆదరణ దక్కుతోంది. కరణ్ అన్షుమన్, గుర్ మీత్ సింగ్, మిహిర్ దేశాయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సీరీస్ లో పంకజ్ త్రిపాఠీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
అయితే ‘మీర్జాపూర్’ సిరీస్ లో అందరినీ ఎంతో ఆకట్టుకున్న మరో పాత్ర బీనా త్రిపాఠీ. ఇందులో ఆమె యాక్టింగ్ అందరినీ భలేగా మెప్పిస్తోంది. ఈ పాత్ర పోషించిన నటీమణి పేరు రసికా దుగ్గల్. వెబ్ సిరీస్ కే ఎంతో కీలకమైన ఈ బోల్డ్ అండ్ స్ట్రగ్లింగ్ కేరక్టర్ లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ కారణంగా ఈ నటీమణికి బాలీవుడ్ లోనే కాకుండా పలు భాషలనుంచి అవకాశాలొస్తున్నాయి.
రసికా దుగ్గల్ కు తెలుగు ఇండస్ట్రీ నుంచి పలు అవకాశాలొచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆమె వాటిలో తనకు బాగా నచ్చిన కథల్నే ఎంపిక చేసుకుంటోందట. త్వరలోనే ఆమె నటించబోయే తెలుగు సినిమాలకు సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుందట. మరి ఈ బ్యూటీ తెలుగులో ఎలాంటి పాత్రలను ఎంపిక చేసుకుందో చూడాలి.
Must Read : భయపెట్టనున్న ‘క్రాక్’ జయమ్మ











