చియాన్ విక్రమ్ కెరీర్ లో మైలురాయి లాంటి సినిమా ‘అన్యన్’ . శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ తమిళ సినిమా తెలుగులో ‘అపరిచితుడు’ పేరుతో అనువాదమైంది. ఇక్కడ కూడా దుమ్ము రేపేసింది. మల్టిపుల్ పెర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడే పాత్రలో విక్రమ్ చేసిన పెర్ఫార్మెన్స్ నభూతో నభవిష్యతి. మూడు విభిన్నపాత్రల్ని డిఫరెంట్ మాడ్యులేషన్స్ తో డిపరెంట్ బాడీ లాంగ్వేజెస్ లో పలికించి.. సౌత్ ప్రేక్షకుల్ని ఫిదా చేసేశాడు. ఈ సినిమా విడుదలై దాదాపు 15 ఏళ్ళు అయిపోతోంది.
ఇన్నాళ్ళకి ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతుండడం విశేషం. ఇటీవల ‘అపరిచితుడు’ సినిమా చూసిన యంగ్ హీరో రణ్ వీర్ సింగ్.. విక్రమ్ యాక్టింగ్ కు షాకయ్యాడట. ఈ మూవీని ఎలాగైనా.. బాలీవుడ్ లో తనే హీరోగా రీమేక్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడట. ఇటీవల ఈ సినిమా విషయమై.. శంకర్ ను కూడా కలిసి.. ఆయన ఓపీనియన్ ను తీసుకున్నాడట. అయితే దీన్ని బాలీవుడ్ లో ఎవరు డైరెక్టర్ చేస్తారు? ఎవరు నిర్మిస్తారు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.
ప్రస్తుతం ‘అపరిచితుడు’ రీమేక్ ప్రయత్నాలు బాలీవుడ్ లో స్పీడ్ గా జరుగుతున్నాయట. అతి త్వరలో అపరిచితుడు బాలీవుడ్ రీమేక్ గురించి అధికారిక ప్రకటన రావచ్చు అని తెలుస్తోంది. ప్రస్తుతం కపిల్ దేవ్ బయోపిక్ 83 సినిమాను విడుదలకు సిద్ధం చేసిన రణ్ వీర్ .. బాలీవుడ్ అపరిచితుడుగా ఏ తరహా పెర్ఫార్మెన్స్ ఇస్తాడో చూడాలి.
Must Read ;- రామ్ చరణ్ -శంకర్ సినిమా పై క్రేజీ అప్టేట్స్