స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియెంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘పుష్ప’. పాన్ ఇండియా లెవెల్లో బహుభాషల్లో ఈ సినిమా ఆగస్ట్ 13న విడుదల కాబోతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ.. రా అండ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ లో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా డీ గ్లామరైజ్డ్ లుక్ తో మేకోవర్ అవుతున్నాడు. రష్మికా మందన్న కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ఇక ఇందులో బన్నీ చేస్తున్న పవర్ ఫుల్ రోల్ ‘పుష్పరాజ్’ కు అంతే పవర్ ఫుల్ గా ఉండే ఒక విలన్ ను సెట్ చేశాడు సుక్కు. ఆ విషయాన్ని ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. అతడు మరెవరో కాదు.. మాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ ఫహద్ ఫాజిల్. ఫహద్ ను ‘పుష్ప’ సినిమాలోకి ఆహ్వానిస్తూ.. ఒక వీడియో కూడా విడుదల చేశారు . ఆహాలో విడుదలైన ట్రాన్స్ సినిమాతో ఫహద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. అంతేకాదు .. అతడి సినిమాల్ని ఓటీటీలో చూసే తెలుగు ప్రేక్షకులకూ కొదవలేదు.
అల్లు అర్జున్ కు మాలీవుడ్ లో బోలెడంత క్రేజుంది. అందుకే ‘పుష్ప’ మూవీని మలయాళంలో కూడా విడుదల చేస్తున్నారు. ఈ కారణం చేతనే ఫహద్ ఫాజిల్ ను విలన్ గా తీసుకున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ కు గట్టి పోటీ ఇవ్వగల నటుడు ఫహద్ ఫాజిల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి పుష్పలో ఫహద్ పాత్రను సుక్కూ ఎంత భయంకరంగా డిజైన్ చేశాడో చూడాలి.
Must Read : ‘పుష్ప’ సినిమాలో అంతమంది విలన్సా.. నిజమేనా?
Welcoming #FahadhFaasil on board for the biggest face-off 😈@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @PushpaMovie #VillainOfPushpa #Pushpa
పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा pic.twitter.com/ndweB09rXi
— Mythri Movie Makers (@MythriOfficial) March 21, 2021











