స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , బ్రిలియెంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్ర కోసం సరికొత్త మేకోవర్ అవుతున్నాడు. కన్నడ బ్యూటీ రష్మికా మందన్న కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా మొన్నీమధ్యే మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఒక షెడ్యూల్ జరుపుకున్న సంగతి తెలిసిందే. త్వరలో ‘పుష్ప’ యూనిట్ కేరళ అడవులకు షిఫ్ట్ కానున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. మార్చ్ 8న పుష్పరాజ్ తన అభిమానులకు ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడట. అదేనండీ.. ఆ రోజు బన్నీ పుట్టిన రోజు. ఆ సందర్భంగా ‘పుష్ప’ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కానీ, ఫస్ట్ గ్లింప్స్ కానీ విడుదల విడుదల చేయాలని సుకుమార్ నిర్ణయించకున్నాడట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందట. ఆగస్ట్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం కాబోతున్న ‘పుష్ప’ సినిమా అల్లు అర్జున్ కి .. రామ్ చరణ్ కు రంగస్థలంలా .. గుర్తుండిపోయే సినిమా అవుతుందని చెప్పుకుంటున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘పుష్ప’ మూవీ.. ఏ రేంజ్ విజయం అందుకుంటుందో చూడాలి.