పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. వకీల్ సాబ్ మూవీతో మళ్ళీ కమ్ బ్యాక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే చిత్రాలన్నీ క్రేజీ కాంబినేషన్స్ తో కూడుకున్నవే. అందులో హరీశ్ శంకర్ దర్శకత్వంలో సినిమా ఒకటి. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబో మళ్ళీ రీపీట్ అవుతుండడంతో .. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మాణం జరుపుకోనుండడం విశేషంగా మారింది.
అయితే ఈ సినిమాకి మరో విశేషం కూడా ఇప్పుడు యాడ్ అయింది. అదేంటంటే.. దీనికి మోస్ట్ ఎఫిషియంట్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి వర్క్ చేయబోతుండడం. ఈ విషయాన్ని మెన్షన్ చేస్తూ.. ఆయనకి ప్రత్యేకాగా ఆహ్వానం పలుకుతూ .. మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషి, జల్సా’ లాంటి సినిమాలకు ఆనంద్ సాయినే ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. అంతేకాదు ఆ సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయి.. పవన్ కు ఆనంద్ సాయి .. హిట్ సెంటిమెంట్ గా మారారు. ఆ సినిమాలతో వీరిద్దరి మధ్య ఇప్పటికీ మంచి రిలేషన్ మెయిన్ టెయిన్ అవుతోంది.
దాదాపు నూరు చిత్రాలకు పైగానే ఆర్ట్ డైరెక్షన్ చేసి.. ఎన్నో అవార్డుల్ని కైవసం చేసుకున్న ఆనందసాయి.. ప్రస్తుతం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి చీఫ్ ఆర్కిటెక్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఆలయ అభివృద్ధి పనులు ఓ కొలిక్కి రావడంతో .. ఆయన మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీస్ వారు.. ఆనంద సాయిని.. పవర్ స్టార్ , హరీశ్ శంకర్ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేశారు. మరి పవర్ స్టార్ కు ఈ సారి ఆనంద్ సాయి .. ఏ రేంజ్ హిట్టిస్తారో చూడాలి.
Must Read ;- పవర్ స్టార్ తో మరోసారి పూరి జగన్నాథ్
Magnificent Art Director Anand Sai garu is back to Cinema after dedicating his 5 years of craftsmanship for Yadadri Temple – The Pride of Telangana!
Welcome on board Anand Sai garu for #PSPK28 💥💥
Power Star @PawanKalyan @harish2you @ThisIsDSP @DoP_Bose pic.twitter.com/tWe8b0hgyA
— Mythri Movie Makers (@MythriOfficial) February 25, 2021