స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో బన్నీ ‘పుష్పరాజ్’ అనే లారీ డ్రైవర్ గా మాసీ గెటప్ లో కనిపించబోతున్నాడట. పాన్ ఇండియా కేటగిరిలో బహుభాషల్లో విడుదలకానున్న ఈ సినమాలో రష్మికా మందన్న కథానాయికగా నటించబోతోంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తోంది.
అదేంటంటే.. ఇందులో మొత్తం 9 మంది విలన్స్ ఉండబోతున్నారట. మెయిన్ విలన్ గా ఒక యువ నటుడ్ని సెలెక్ట్ చేయబోతున్న సుక్కూ .. ఇంకా ఎనిమిది మంది వెర్సటైల్ ఆర్టిస్టుల్ని ఎంపిక చేశాడట.రావు రమేష్ , ముఖేష్ రుషి లాంటి సీనియర్ నటులతో పాటు.. సునీల్, చియాన్ విక్రమ్ కూడా విలన్స్ గా నటించబోతున్నారట. అలాగే.. మరికొందరు విలన్స్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో ఒక షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్న ‘పుష్ప’ టీమ్ త్వరలోనే హైద్రాబాద్ లో తదుపరి షెడ్యూల్ మొదలు పెట్టనుందట.
Must Read ;- పొలిటికల్ లీడర్ గా అల్లు అర్జున్?











