ఇద్దరు బ్యాచ్ లర్ల మధ్య జరిగే సంభాషణ ఇది.
అతను: నీ మ్యారీడ్ లైఫ్ నుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నావ్?
ఆమె: కేరింగ్ హజ్ బెండ్.. అన్ని పనులూ చేసేసుకోవాలి
ఆమె: నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే చిరాకు
ఆమె: లవ్ లవ్ లవ్ … ఇంకేముంటుందండీ మ్యారీడ్ లైఫ్ లో
అతను: కొంచెం వైల్డ్ గా థింక్ చెయ్ .. డార్లింగ్
ఆమె: నాక్కాబోయేవాడు నా షూస్ తో సమానం
.. ఇలా అనేసి ట్విస్ట్ ఇచ్చేసిందా భామ.
ఆమె: డు యూ లైక్ సన్ రైజ్ అండ్ సన్ సెట్
అతను: నాకు మాత్రం సన్ సెట్ ఇష్టం
ఆమె: ఎందుకు?
అతను: ఎందుకంటే దాని తర్వాతేగా రాత్రొస్తుంది.
ఆమె: సైకో ఫెలో
అతను: వాట్ డు యు ఎక్స్ పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్?
ఆమె: ఆ.. ఇడ్లీ వడ సాంబార్
ఇలా ముగిసిందండీ ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ల సంభాషణ. ఇది పెళ్లి కథా.. ప్రేమ కథా అన్నది మనం ఊహించుకోవాల్సింది. మరో విషయం ఏమిటంటే ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుందన్నది స్పష్టత కూడా వచ్చేసింది.
అక్కినేని వారసుడు అఖిల్ తాజా అప్ డేట్ టీజర్ రూపంలో ఇలా వచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఈ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ ను ఈరోజు మధ్యాహ్నం 11.48 గంటలకు విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తికావస్తోంది. ఇందులో అఖిల్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2 పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆ టీజర్ ఎలా ఉందో ముందు చూసేయండి. సినిమా విడుదల మాత్రం సంక్రాంతి అని టీజర్ చివర ఇచ్చేశారు.











