నాడు ఫిర్యాదులు .. నేడు విందులు .. గమనిస్తునారు…!
ఏపీలో సుప్రీం కోర్టు ఛీప్ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటిస్తున్నారు. దేశ అత్యున్నత న్యాయం స్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తరువాత ఆయన మొదటిసారిగా కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామానికి వచ్చారు. శనివారం ఉదయం బెజవాడ శ్రీ కనదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్ర 5 గంటలకు ఏర్పాటు చేసిన ఏపి ప్రభుత్వం ఇచ్చే తేనీటి విందులో జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి జగన్ పాల్గొని విందుని స్వీకరిస్తారు. వీరితోపాటు పలువురు మంత్రులు, న్యాయ మూర్తులు, న్యాయవాదులు ఇందులో పాల్గొననున్నారు. అయితే జగన్ రెడ్డి, జస్టిస్ ఎన్వీ రమణ పరస్పరం కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ కూడా నడుస్తోంది. నాడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్న ఎన్వీరమణ పై ఫిర్యాదు చేసిన జగన్ రెడ్డి.. నేడు ఏ ముఖం పెట్టుకుని ఆయన ఎదుట విందుకు పాల్గొంటున్నారో చెప్పాలని విపక్షాలు నిలదీస్తున్నాయి.
జస్టిస్ ఎన్వీ రమణ ప్రత్యర్థి వర్గం ..!
నాడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి .. సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ ఎన్వీ రమణపై, ఏపీ హైకోర్టు ఛీప్ జస్టిస్, మరో ముగ్గురు న్యాయమూర్తులపై ఫిర్యాదు చేశారు. ఏపీ విషయాల్లో జస్టిస్ రమణను ప్రత్యర్థి వర్గమని పరోక్షంగా విమర్శలు కూడా చేశారు. అంతేకాక పాకీ (పంచ్) ప్రభాకర్ తో కూడా నోటికొచ్చినట్లు తిట్టించారు. చట్టాలు, రాజ్యాంగంలోని అంశాలు, న్యాయవ్యవస్థలంటనే జగన్ రెడ్డికి, ఆపార్టీ నేతలకు అసలు పట్టవన్నది సుస్పష్టం! అలా విమర్శలు, ఫిర్యాదు చేసిన జగన్ రెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఛీప్ జస్టిస్ హోదాలో ఏపీకొచ్చిన జస్టిస్ రమణకు మర్యాదులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఇందిరా గాంథీ మున్సిపల్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు తేనేటి విందు, ఆ తరువాత జస్టిస్ రమణ, సీఎం జగన్ రెడ్డి లు ముఖాముఖిగా కలుసుకుని మాట్లాడటం జరుగుతోంది! అప్పడు విమర్శిచిన నోర్లే .. నేడు మర్యాదతో పొగడక తప్పడంలేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి!!











