104 సేవలు ఎలా ఉన్నాయో స్వయంగా ఎంపీ విజయసాయిరెడ్డికే బోధపడింది. శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించిన ఆయన కలెక్టరేట్లో 104 కంట్రోల్ రూంకు ఒక్క కాల్ రాకపోవడాన్ని గమనించారు. దీంతో ఆయనే స్వయంగా 104కు ఫోన్ చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనెక్టు కాలేదు. దాదాపు 20 నిముషాలు ప్రయత్నించినా ఎటువంటి ఫలితం కలుగలేదు. దీంతో ఆయన ఆ సర్వీసును పర్యవేక్షిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారితో మాట్లాడి పరిస్థితిని వివరించారు. సర్వర్‌లో సాంకేతిక లోపం వలనే కాల్స్‌లో ఇబ్బందులు కలుగుతున్నాయని ఆ అధికారి ఎంపీకి తెలిపారు. దీంతో సమస్యను పరిష్కరించాలని విజయసాయి అధికారులకు సూచించారు.
Must Read ;- విశాఖ కేజీహెచ్‌లో బెడ్ దొరక్క అంబులెన్స్ లోనే చిన్నారి మృతి