కరోనా కేసులు పెరిగిపోతుండటంతో వైఎస్ షర్మిల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో బెడ్లు లేవని, కరోనా టెస్టులు చేయడం లేదని అన్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నా కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు. కరోనా రోగులపై మానవత్వం చూపడం లేదని, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు సిగ్గు లేదని ట్విట్టర్ లో మండిపడ్డారు. కరోనా కట్టడిపై వైఎస్ షర్మిల టీం కూడా స్పందించింది. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని గవర్నర్ తమిళ సైకు లేఖ రాసింది. కరోనాతో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలని కోరింది. అలాగే విధి నిర్వహణలో కరోనా బారిన పడుతున్న జర్నలిస్టు కుటుంబాలకు 50 లక్షల బీమా ఇవ్వాలని వైఎస్ షర్మిల టీం కోరింది.
Must Read ;- కరోనాపై ‘సీతక్క’ పోరు : కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని దీక్ష
కరోనా టెస్టులు లేవు ..
హాస్పిటల్స్ లో బెడ్స్ లేవు .. పట్టించుకొనే డాక్టర్స్ లేరు,
ఊపిరి నిలిపే ఆక్సిజన్ సిలిండర్లు లేవు .. బతికించే వాక్సిన్ లేదు,
కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చేది లేదు .. కరోనా రోగులపై కనికరం చూపేది లేదు,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గు లేదు. pic.twitter.com/L3AnsVflPr— YS Sharmila (@realyssharmila) April 30, 2021