ఇప్పటిదాకా ప్రపంచాన్ని కరోనా కలవర పెడితే ఇప్పుడు ఆ ముక్కోణపు రాయి మరింత కలవరపెడుతోంది. అదే మోనోలిత్. ఇప్పటిదాకా ఈ మోనోలిత్ అనే మాట విదేశాలకే పరిమితమైంది. ఇప్పుడు ఇండియాలోనూ ఈ మోనోలిత్ కినిపించడం కలవర పాటుకు గురిచేస్తోంది. క్రిస్మస్ వారాంతంలో న్యూయార్క్ లోనూ ఈ రాయి కనిపించి ఆందోళనకు గురిచేసింది. న్యూయార్క్ లోని ఫుడ్ స్టాక్ లోని జెనా కార్న్ ఫీల్డ్ లో 9 అడుగుల పొడవున్న ఏక శిల కనిపించి ఆశ్చార్యానికి గురిచేసింది. ఇది ఎక్కడి నుంచి వస్తోందో? ఎవరు దీన్ని అక్కడ ఉంచుతున్నారో అంతుబట్టడం లేదు. తాజాగా ఇండాయాలో కూడా ఈ రాయి కనిపించింది.

అహ్మదాబాద్ లోని తలైజ్ ప్రాంతంలో ఉన్న సింఫనీ పార్క్ లో ఈ రాయి కనిపించింది. దాంతో ప్రజలు కంగుతిన్నారు. ఉదయం లేని రాయి సాయంత్రం ఆ ప్రాంతంలో ఉందని ఓ ఉద్యోగి తెలిపారు. ప్రస్తుతం ఈ రాయి ఫొటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఇది ఎలియన్స్ పనిగానే అందరూ భావిస్తున్నాయి. ఈ రాయి మిస్టరీ వీడితే తప్ప ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే వాతావరణం కనిపించడం లేదు. మన భూమ్మీద ఎక్కడా ఇలాంటి రాళ్లు లేవని అంటున్నారు. ఇది గ్రహాంతర వాసుల పనిగానే భావిస్తున్నారు. ట్విస్ట్ ఏమిటంటే అహమ్మదాబాద్ లోని సింఫనీ పార్క్ లో కనిపించిన మోనోలిత్ తరహా శిల సింఫనీ పార్క్ యాజమాన్యమే ఏర్పాటుచేసిందట.











