కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజుల కిందట ఆయనకు కరోనా సోకింది. హైదరాబాద్ అపోలో ఆస్పత్రి ఐసీయూ లో చికిత్స పొందుతు మృతి చెందారు.
వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణ రెడ్డి కి హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో డిసెంబరు 13 వ తేదీన చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రి ఐసీయూ లో జాయినయ్యారు. ఇరవై రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడం తో హైదరాబాద్ అపోలో ఆసుపత్రి లో అడ్మిట్ అయిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి పరిస్థితి విషమించడంతో శుక్రవారం మరణించారు.
చల్లా రామకృష్ణా రెడ్డి వయస్సు 72 సంవత్సరాలు. ఆయన 1948 ఆగస్టు 27న జన్మించారు. కర్నూలు జిల్లాలోని పాణ్యం, కోయిలకుంట్ల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. జగన్మోహన్ రెడ్డి ఆయనను ఎమ్మెల్సీగా శాసనమండలికి పంపారు.











