తెలుగు సినిమా రంగంలో శ్రీదేవి మూవీస్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నటసింహ బాలకృష్ణతో ‘ ఆదిత్య 369, వంశానికి ఒక్కడు, భలేవాడేవి బాసూ, మిత్రుడు’ లాంటి సినిమాలు అందించిన అగ్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లు తన అభిరుచి అప్డేట్ చేసుకుని , ఇటీవలి కాలంలో ‘ జెంటిల్ మాన్, సమ్మోహనం, బ్లఫ్ మాస్టర్’ , ఎంత మంచి వాడివిరా’ సినిమాలు తీశారు.
ఇప్పుడు యువ హీరో నాగ శౌర్య తో తన తదుపరి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు శివలెంక కృష్ణ ప్రసాద్. ఈ మూవీ ద్వారా శ్రీమాన్ అనే కొత్త డైరెక్టర్ ని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ 2021 ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టె ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది.











