ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ ‘143’ సినిమాతో, 2004 లో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలయింది. ఆ తర్వాత కృష్ణ వంశీ ‘ డేంజర్ ‘ సినిమాలో ఒక హీరోగా నటించారు. తమ్ముడిని హీరోగా నిలబెట్టడానికి పూరి చేయని ప్రయత్నం లేదు. ‘ నేనేనింతే ‘ సినిమాలో తమ్ముడికి మంచి పాత్ర ఇచ్చారు. అదీ ఫెయిల్ అయింది. ఆ తర్వాత దిల్ రాజు తో కలిసి, సాయి రామ్ శంకర్ డ్యూయెల్ రోల్ లో ‘హలో ప్రేమిస్తారా?’ సినిమా నిర్మించారు పూరి జగన్నాథ్ . శిష్యుడు గోపీ గణేష్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ‘ రోమియో’ తీశారు.
సాయి రామ్ శంకర్ ఆ తర్వాత’ నేనో రకం, దిల్లున్నోడు, వెయ్యి అబద్దాలు’ మొద లయిన సినిమాలు చేశారు. పూరి స్క్రిప్ట్ అందించి, మరో శిష్యుడు జయ రవీంద్ర డైరెక్షన్ లో సాయి రామ్ శంకర్, బిందు మాధవి జంటగా ‘ బంపర్ ఆఫర్’ సినిమా తీశారు. ఆ సినిమా హిట్ అయింది. నిజానికి దర్శకుడు జయ రవీంద్ర అంతకు ముందు ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, శోభన్, యోగి, మెహెర్ రమేష్ వద్ద పని చేశారు.
‘ బంపర్ ఆఫర్’ తర్వాత జయ రవీంద్ర సాయి రామ్ శంకర్ తోనే ‘ దిల్లున్నోడు’ అనే సినిమా తీశారు. హిందీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ‘ ఆషికీ-2 ‘ తెలుగు లో సచిన్ తో రీమేక్ చేసారు. ప్లాప్ అయింది. ఇప్పుడు హీరో సాయి రామ్ శంకర్, డైరెక్టర్ జయ రవీంద్ర ‘ బంపర్ ఆఫర్ ‘ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కథ పూరి జగన్నాథ్ రాయడం లేదని , డైరెక్టర్ జయ రవీంద్ర స్వయం గా రాయబోతున్నాడట. ఈ సినిమా ను ఒక కొత్త నిర్మాత రూపొందించబోతున్నారు. త్వరలోనే ‘బంపర్ ఆఫర్2’ అనౌన్స్ మెంట్ వస్తుంది.











