సూపర్ స్టార్ మహేష్ బాబు – టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం మహర్షి. ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. మహేష్ బాబు 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహర్షి అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది. అంతే కాకుండా.. ఈ సినిమా విజయాన్ని అందించడంతో పాటు మహేష్ అండ్ టీమ్ కి గౌరవాన్ని కూడా తీసుకువచ్చింది. అందుకనే మహేష్ వంశీ పైడిపల్లితో మరో సినిమా చేయాలనుకున్నారు. వంశీ కథ రెడీ చేయడం జరిగింది. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాలి అనుకున్నారు.

అయితే.. కథ మహేష్ కి నచ్చకపోవడంతో సెట్స్ పైకి వెళ్లకుండా ఆగిపోయింది. ఆతర్వాత మహేష్ పరశురామ్ తో సినిమాకి ఓకే చెప్పారు. అదే సర్కారు వారి పాట. ఈ చిత్రం జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. మహేష్ నో చెప్పిన తర్వాత వంశీ పైడిపల్లి కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు. రామ్ చరణ్ తో సినిమా చేయాలని ట్రై చేసారు. అక్కడ కూడా కథ ఓకే కాలేదు. ఆఖరికి ఆహా కోసం వంశీ పైడిపల్లి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే.. మహేష్ – వంశీ పైడిపల్లి సినిమా గురించి మళ్లీ వార్తలు వస్తున్నాయి.
దీంతో ఇది నిజమా కాదా అనే అనేది ఆసక్తిగా మారింది. అయితే.. మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసారు. ఆ ఫోటోలో మహేష్ బాబు, మరికొంత మంది స్నేహితులు డిన్నర్ పార్టీలో పాల్గొన్నారు. అందులో వంశీ పైడిపల్లి కూడా ఉన్నాడు. ఈ ఫోటో బయటకు వచ్చినప్పటి నుంచి ప్రచారంలో ఉన్న మహేష్ – వంశీ మూవీ నిజమే అనిపిస్తుంది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త పై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Must Read ;- పాపం .. పరశురామ్ కి అగ్ని పరీక్షే!











