టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన చిత్రాల్లో మంచి లాభాలు తీసుకువచ్చిన సినిమాల్లో ‘ఎఫ్ 2’ ఒకటి. విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఎఫ్ 2 మూవీకి సీక్వెల్ గా ఎఫ్ 3 తీయాలని ఫిక్స్ అయ్యారు. వెంకీ, వరుణ్ ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి అనిల్ రావిపూడి రెడీగా ఉన్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని నిర్మించడానికి నిర్మాత దిల్ సైతం సిద్ధంగా ఉన్నారు.
అయితే… ఇప్పుడు ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి.. ఓ ప్రాబ్లమ్ వచ్చిందట. అదేంటంటే.. ఎఫ్ 2 సక్సస్ అయిన తర్వాత ఎఫ్ 3 మూవీకి వెంకీకి ఎంత ఇస్తామో నీకు అంతే ఇస్తానని మెగా హీరో వరుణ్ తేజ్ కి దిల్ రాజు మాట ఇచ్చారట. ఇప్పుడు వెంకీకి 12 కోట్లు ఇస్తున్నారట. అందుచేత తనకు కూడా అంతే రెమ్యూనరేషన్ ఇవ్వాలని వరుణ్ తేజ్ డిమాండ్ చేస్తున్నాడట. వెంకీ, వరుణ్, అనిల్ రావిపూడి… ఈ ముగ్గురి రెమ్యూనరేషనే దాదాపు 35 కోట్లు అవుతుందట. దీంతో టోటల్ మూవీ బడ్జెట్ దాదాపు 65 కోట్లు అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత బడ్జెట్ ఈ సినిమా పై వర్కవుట్ అవుతుందా..? అని దిల్ రాజు ఆలోచనలో పడ్డారట.
దీంతో బడ్జెట్ ని ఎలా తగ్గించాలా అని బడ్జెట్ పై వర్క్ చేస్తున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దిల్ రాజు ఇదే పనిలో ఉన్నారట. అంతా అనుకున్నట్టు జరిగితే… డిసెంబర్ నుంచి ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి.. వరుణ్ తేజ్ అడిగినట్టుగా రెమ్యూనరేషన్ ఇస్తారా..? లేక తగ్గిస్తారా..? టోటల్ బడ్జెట్ ఎంత తగ్గిస్తారు..? ఇంతకీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..? అనేది క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read: బాలీవుడ్లో తెలుగు రీమేక్ ల సందడి











