ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్‌లో ఏం సాధించుకు వచ్చారు. ఏం అడుగుతున్నారు? ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏం మర్చిపోతున్నారు? ఇవన్నీ కీలకాంశాలే..!
చాలా రోజుల తరువాత ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. గ్రేటర్ ఎన్నికల తరువాత ఇక కేంద్రంపై యుద్ధమే అంటు ప్రకటించిన కేసీఆర్ సడన్ గా ఢిల్లీ పర్యటకు వెళ్ళడంపై విపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. ప్రధానితో సహా కేంద్ర మంత్రులందరినీ ఏకి పారేసిన కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రుల ముందు వంగివంగి దండాలు పెడుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే రాష్ట్ర అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం నుండి నిదులు రప్పించుకునేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారంటున్నారు టీఆర్ఎస్ నేతలు. అందుకనుగుణంగానే ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులతో వరుస భేటీలు అవుతున్నారు. తమ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. తెలంగాణకు గత కొన్నాళ్ళుగా కేంద్ర నిదులు నిలిచిపోయాయని వాటి వల్ల రాష్ట్రంలో అభివృద్ది పనులు నిలిచిపోయినందున బకాయిలు విడుదల చేయాలని కోరారు.
వరద నష్టం నిధులను వెంటనే ఇవ్వండి..
కేంద్ర హోం శాఖ మంత్రితో భేటీలో రాష్ట్రంలో గత కొన్ని రోజుల క్రితం వచ్చిన వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారని.. రోడ్లు పూర్తిగా పాడైపోయిన నేపథ్యంలో వాటి మరమ్మత్తులకు, నష్టపోయిన వారిని ఆదుకునేందుకు నిధులను ఇవ్వాలంటూ అమిత్‌షాను కోరారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫండ్ రిలిజ్ చేస్తే కాస్తా పరిస్థితులు మెరుగవుతాయని విన్నవించారు. ఇక నీటి పారుదల శాఖ మంత్రితోనూ ఆయన రాష్ట్రంలో కాళేశ్వరం నుండి మరో టీఎంసీ నీటిని తోడుకునేందుకు అనుమతులివ్వాలంటూ విజ్ఞప్తి చేసినట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలకోస నిదులను డిమాండ్ చేయడంతో తప్పులేదు కాని కేంద్ర మంత్రులకు నమస్కారాలు చేయడంలో ఎక్కడో స్వప్రయోజనాలు దాగున్నాయేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. కేంద్ర హోం మంత్రి వద్ద నమస్కారం చేస్తూ విడుదల చేసిన ఫోటోపై అనేక రూమర్స్ పుట్టుకొస్తున్నాయి.
Must Read ;- దూకుడు తగ్గని బీజేపీ.. గులాబీ శిబిరంలో గుబులు
సిద్ధిపేట విమానాశ్రయానికి దక్కని చోటు..
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు విమానయాన శాఖ మంత్రిని కలిసి రాష్ట్రంలో కమర్షియల్ పర్పస్ లో వినియోగానికి చిన్నచిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. లిస్ట్ లో పెద్దపల్లి బసంత్ నగర్, వరంగల్ అర్బన్ లో మామునూర్ , అదిలాబాద్ , నిజామాబాద్, మహబూబ్ నగర్ దేవర కద్ర, కొత్తగూడెంలలో విమానాశ్రాయ ఏర్పాటుకు అనుమతి కోరారు. అయితే రెండురోజుల క్రితం సిద్దిపేట పర్యటనలో ఆ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. కాని నేడు విమానాశ్రయాల ఏర్పాటు కోసం చేసిన విజ్ఞప్తిలో సిద్దిపేట ఎయిర్ పోర్టు లేక పోవడంపై రాష్ట్రంలో విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇక్కడ ఘనంగా ప్రకటన చేసిన కేసీఆర్ కు ఢిల్లీ చేరుకునే సరికి వాస్తవాలు బోధపడ్డాయా అంటు ప్రశ్నిస్తున్నారు.
అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటు అంత ఈజీ కాదని.. కేవలం రాబోయే సిద్దిపేట మునిసిపాలిటీ ఎన్నికల్లో లబ్దికోసమే ముఖ్యమంత్రి మరో అబద్దం ఆడాడంటూ విమర్శిస్తున్నాయి. మొత్తానికి సీఎం ఢీల్లిపర్యటనపై రెండు రోజులుగా విమర్శలు చేస్తున్నప్రతిపక్షాలకు కేసీఆర్ స్వయంగా మరో అస్త్రం అందిచినట్టైంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read ;- పొత్తు తప్పదా.. బీజేపీ ట్రాప్‌లో కేసీఆర్, ఎంఐఎం పడినట్టే..