సూపర్ స్టార్ మహేష్ బాబు, గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లితో సినిమా చేస్తారు అనుకున్నారు కానీ… లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయ్యింది. ఆతర్వాత డైరెక్టర్ పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో ఓకే చెప్పారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది.
ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. మహేష్ బాబు, పరశురామ్ అండ్ టీమ్ అమెరికా వెళ్లి లోకేషన్స్ చూసి ఎక్కడెక్కడ షూటింగ్ చేయాలి అనేది ఫైనల్ చేశారు. జనవరి నుంచి అమెరికాలో షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసేశారు. మహేష్ ముందుగానే అమెరికా చేరుకున్నారు. అయితే… అక్కడ కోవిడ్ కేసులు పెరుగుతుండడం.. ఎన్నికలు వలన ఏర్పడిన పరిస్థితులు కారణంగా ‘సర్కారు వారి పాట’ టీమ్ ప్లాన్ మారిందని తెలిసింది.
ఇంతకీ ప్లాన్ ఏంటంటే… ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో కాకుండా ఇండియాలోనే ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈ మూవీ కోసం భారీ సెట్ రూపొందిస్తున్నారు. ఈ సెట్ లో దాదాపు నెల రోజులు పాటు షూటింగ్ చేయనున్నారు. ఈ సెట్ లో జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఆతర్వాత మార్చిలో అమెరికాలో షూటింగ్ చేయనున్నారు. ఇక విలన్ రోల్ విషయానికి వస్తే… ఇప్పటి వరకు ఈ సినిమాలో విలన్ ఎవరు అనేది ఫైనల్ చేయలేదు. విలన్ రోల్ కోసం టాప్ యాకర్ట్ ను సెలెక్ట్ చేయనున్నారని సమాచారం. అయితే.. ఎవరా టాప్ యాక్టర్ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ చాలా గ్యాప్ తర్వాత మహేష్ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ మూడు పాటలకు సంబంధించిన ట్యూన్స్ ఫైనల్ చేసారు. మహేష్ బాబుని అభిమానులు ఎలా చూడాలనుకుంటారో… అలా ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ ఉంటుందని… ఖచ్చితంగా అభిమానులకు పండగే అనేలా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు పరశురామ్ ఇటీవల మీడియాతో చెప్పారు. దీంతో ‘సర్కారు వారి పాట’ పై అభిమానుల్లో ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. మరి… బాక్సాఫీస్ వద్ద మహేష్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.