మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నారు. అలాగే నాన్న చిరంజీవి ఆచార్య సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాత కూడా చరణే. ఈ విధంగా చరణ్ ఓ వైపు హీరోగా నటిస్తూ.. మరో వైపు నిర్మాతగా సినిమా నిర్మిస్తూ.. ఫుల్ బిజీలో ఉన్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉంటుందని అఫిషియల్ గా ఎనౌన్స్ చేయడం జరిగింది. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
కరోనా కారణంగా ఆగింది కానీ.. లేకపోతే ఈపాటికే సెట్స్ పై ఉండేది. మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. అయితే.. ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్ తదుపరి చిత్రాన్ని ఎనౌన్స్ చేశాడు కానీ.. చరణ్ మాత్రం తదుపరి చిత్రం ఎవరితో అనేది ఇప్పటి వరకు ప్రకటించలేదు. దీంతో చరణ్ తదుపరి చిత్రం ఎవరితో ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. వంశీ పైడిపల్లి, గౌతమ్ తిన్ననూరి, పూరి జగన్నాథ్ ఇలా.. కొంత మంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ డైరెక్టర్స్ తో పాటు భీష్మ సినిమాతో మరో సక్సెస్ సాధించిన వెంకీ కుడుములతో చరణ్ సినిమా చేయనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
తాజా వార్త ఏంటంటే.. వెంకీ కుడుముల చెప్పిన స్టోరీకి చరణ్ నో చెప్పాడట. ఇందులో అతని క్యారెక్టర్ నచ్చలేదో.. ఏకంగా కథ నచ్చలేదో కానీ.. వెంకీ చెప్పిన స్టోరికి చరణ్ నో చెప్పేసాడని తెలిసింది. చరణ్ నో చెప్పిన స్టోరీని వెంకీ.. మహేష్ బాబుకు చెప్పాడట. ఈ కథ తనకు బాగా నచ్చిందని.. మనం సినిమా చేద్దామని మహేష్.. వెంకీ కుడుములకు మాట ఇచ్చారట. వెంకీ ప్రస్తుతం ఫుల్ స్టోరీ రెడీ చేసే పనిలో ఉన్నారు. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత వెంకీ కుడుములతో సినిమా చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇలా.. చరణ్ నో చెప్పిన స్టోరీకి మహేష్ ఓకే చెప్పాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే.. వెంకీ కుడుముల లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే.
Must Read ;- వచ్చే ఏడాది సమ్మర్ లో మొదలుకానున్న రెబల్ స్టార్ ఫాంటసీ మూవీ