టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 135వ రోజు నిడిగల్లు శివారు క్యాంపు స్థలం నుంచి ప్రారంభమై సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఇనుగుంటలో ప్రవేశించింది. యువ నాయకుడిపై మహిళలు, యువకులు పూలవర్షం కురిపించి నివాళులర్పించారు. వెంకటగిరి నియోజకవర్గంలో చివరిరోజు పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన ఆయన మామ నందమూరి రామకృష్ణ.. లోకేష్ తో కలిసి ముందుకు సాగారు. జయంపులో బ్రాహ్మణులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు లోకేష్. నిడిగల్లు నుంచి ప్రారంభమైన పాదయాత్ర పగిలి, కమకూర, హస్తకావేరి, జయంపు మీదుగా ఇనుగుంట వద్ద సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి కొత్తపాలెంపాడు మీదుగా వజ్జవారిపాలెం రిసార్ట్‌కు చేరుకుంది. 138వ రోజు లోకేష్ 16.3 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకు యువగలం పాదయాత్ర 1753.4 కి.మీ. పూర్తయింది.
టీడీపీ అధికారంలోకి రాగానే బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరిస్తామని లోకేశ్ అన్నారు. ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఆలయాల నిర్వహణకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బ్రాహ్మణులు ఎంత పేదవారైనా ఆదుకోవాలని అడిగే సందర్భాలు ఉండవని.. అలాంటి సంఘాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అర్చకులకు గౌరవ వేతనం అందజేస్తామని తెలిపారు. బ్రాహ్మణులను పేదరికం నుంచి బయటకు తీసుకువస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 285 కోట్లు ఖర్చు చేశామన్నారు.
జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దాని వెనుక రాజకీయ కోణం ఉంటుందనే చెప్పాలి. అందులో ఎలాంటి డౌట్ లేదు. అదే క్రమంలో మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంటే దీని ద్వారా టిడిపి హయాంలో తీసుకొచ్చిన అమరావతిని దెబ్బకొట్టడం, అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో రాజకీయంగా లబ్ది పొందడం జగన్ వ్యూహం. కానీ ఈ వ్యూహం పూర్తిగా విఫలమవుతుంది. మూడు రాజధానులు అని చెప్పి..మూడేళ్లు దాటిన రాజధానికి దిక్కు లేదు. అసలు రాష్ట్రానికి రాజధాని ఏది అని చెప్పలేని పరిస్తితి. ఇదే క్రమంలో రాయలసీమలో కూడా వైసీపీని టిడిపి నిలువరించనుంది. ఈ క్రమంలోనే తాజాగా లోకేష్ కర్నూలులో పాదయాత్ర చేస్తూ..అక్కడ లాయర్లకు కీలక హామీ ఇచ్చారు. టిడిపి అధికారంలోకి రాగానే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇది సాధ్యం అయ్యే అవకాశం ఉంది.
జగన్ చెప్పే అబద్దాలు తియ్యగా ఉంటాయని, కానీ తాము చెప్పే నిజాలు చేదుగా ఉంటాయని..జగన్ నాలుగు ఏళ్ల కాలంలో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని కోసం ఒక్క ఇటుక కూడా పెట్టలేదని అన్నారు. మొత్తానికి ఈ హామీ గాని ప్రజల్లోకి వెళితే ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపికి అడ్వాంటేజ్ అవుతుంది. జగన్ వేసే ఎత్తులకు నారా లోకేష్ చైతు చేస్తున్నాడు.యువగలం పాదయాత్రలో వైసీపీ ని ఒక ఆట ఆడుకుంటున్నాడు. లోకేష్ ఈ రంగెలా మాట్లాడుతాడు అని సీఎం జగన్ అసలు ఊహించలేదని అంటున్నారు.. అలాగే లోకేష్ ఇచ్చే ఏ హామీలైన ప్రజలకు ఉపయోగ పడే విధంగా ఉన్నాయని, వైసీపీ నాయకులూ చేస్తున్న అవినీతి పాలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు..











