(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లాలోని మక్కువ మండలం శంబర పోలమాంబ జాతర కన్నుల పండువగా జరిగింది. సిరిమాను ఊరేగింపుగా నడిమి వీధి, పణుకు వీధి, ప్రధాన వీధి, గొల్ల వీధి మీదుగా గద్దె వద్దకు చేరుకుంది. కొవిడ్ నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
కోవిడ్ నేపథ్యంలో..
కొవిడ్ నేపథ్యంలో భక్తుల రాకను నియంత్రించేందుకు బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలను నిలుపుదల చేసేందుకు అధికారులు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, కిలోమీటర్ల మేర నడుచుకుంటూ, ద్విచక్ర వాహనాలు, నాటు బండ్ల ద్వారా అమ్మ సన్నిధికి భక్తజనం చేరుకున్నారు. ఓఎస్‌డీ సూర్యచందర్ రావు ఆధ్వర్యంలో సుమారు 600 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకూ తావులేకుండా చర్యలు చేపట్టారు.
Must Read ;- కూతుళ్లను చంపిన ఉన్మాదం.. న.మో. భక్త కుటుంబం!