ఏపీలో విజయవాడలో వచ్చిన వరదల కారణంగా నిరాశ్రయులైన లక్షల మంది ప్రజలను ప్రభుత్వం తక్షణం ఆదుకుంటూ క్షేత్ర స్థాయిలో నిలబడి వారికి అండగా నిలుస్తుంది. కానీ, వైఎస్ జగన్ తన వంతు సాయం చేయకపోగా ప్రభుత్వం విఫలమైందంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎంతో మంది ప్రముఖులు వరద బాధితుల పట్ల సానుభూతి ప్రదర్శిస్తూ తమకు తోచిన సాయం చేస్తున్నారు. కానీ, జగన్ మాత్రం తనకు లబ్ధి చేకూరడం కోసం వరద బాధితులకు వచ్చి, ఎడమ చేయితో దీవిస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఎవరైనా చెబుతారేమో అని ఆశగా జగన్ ఎదురు చూస్తున్నారు. కానీ, తనకు అనుకూల సమాధానం ఎవరూ చెప్పకపోవడంతో జగనే స్వయంగా ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారు.
దీనిపై సినీ సెలబ్రిటీలకు చిర్రెత్తుకొస్తోంది. ఆ క్రమంలోనే సీనియర్ నటుడు బ్రహ్మాజీ జగన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. నిన్న రాత్రి జగన్ చేసిన ఓ పోస్ట్‌కు ఆయన దారిలోనే వెళ్లి బ్రహ్మాజీ సమాధానం ఇచ్చారు. ‘‘మీరు కరెక్ట్ సార్.. వాళ్ళు చెయ్యలేరు.. ఇక నుంచి మనం చేద్దాం.. ఫస్ట్ మనం రూ.వెయ్యి కోట్లు విడుదల చేద్దాం. మన వైసీపీ కేడర్ మొత్తాన్ని రంగంలోకి దింపేద్దాం.. మనకి జనాలు ముఖ్యం.. ప్రభుత్వం కాదు. మనం చేసి చూపిద్దాం సార్.. జై జగన్ అన్నా’’ అంటూ పోస్ట్ పెట్టారు.
దీనిపై వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి చింతా.. నటుడు బ్రహ్మాజీ కామెంట్ పై ఘాటుగా స్పందించారు. ఏకంగా సినిమా నటీనటులనే కించ పరుస్తూ పోస్ట్ పెట్టారు. దీంతో బ్రహ్మాజీ కూడా వారికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఆ పోస్ట్ తాను చేయలేదంటూ తాజాగా ఎక్స్‌లోనే తెలిపారు. తన అకౌంట్ హ్యాక్‌కు గురైందని చెప్పారు. నా ఎక్స్ అకౌంట్ ని ఎవరో హ్యాక్ చేశారు.. నాకు ఆ ట్వీట్‌కు సంబంధం లేదు. కంప్లైంట్ కూడా చేశాను అని బ్రహ్మాజీ మరో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బరితెగించి ప్రవర్తిస్తున్న వైసీపీ నేతలను బ్రహ్మాజీ ఒక ఆట ఆడుకున్నారు.
వరదలు వచ్చి ఈ ఆదివారానికి సరిగ్గా 8 రోజులు. తొలి గంట నుంచే ప్రభుత్వ అధికారులను చంద్రబాబు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. తాను కూడా విశ్రమించడం లేదు. ఎక్కడికక్కడ బాధితులకు ఆహారం, నీరు అందిస్తూ విశ్రాంతి లేకుండా సిబ్బంది శ్రమిస్తున్నారు. మరోవైపు, అటు వరదకు కారణమై బుడమేరు వాగుకు మరమ్మత్తులు చేపట్టారు. ఇంత పక్కాగా చేస్తుంటే.. జగన్ రెడ్డి తన కళ్లకు గంతలు కట్టుకున్నవాడిలా అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. దీంతో నెటిజన్లు కూడా ముఖ్యంగా విజయవాడ వాసులు ఫైర్ అవుతున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సాయం మీకు కనపడటం లేదా జగన్ అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఐదేళ్ల పాటు నువ్వు చేసిన నిర్వాకం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.











