గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా చూపు టీడీపీ పైన పడిందా? వైసీపీ లో లుకలుకలు పెరిగాయా? వైసీపీ మీదప్రజలు ఆగ్రహంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానం తెలుసుకున్నాడు ఎమ్మెల్యే ముస్తఫా అందుకే టీడీపీవైపు చూస్తున్నారు తెలుస్తోంది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం ఇప్పుడు ఎన్నికల వాతావరణం నెలకొంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం మంత్రంతోనే ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నిత్యం ప్రజా క్షేత్రంలో తిరుగుతూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లిన వైసీపీ నేతలు తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఈ సమయంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు పలుచోట్ల ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇక తాజాగా గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాకు నిరసన సెగ తగిలింది. ముస్తఫా ఆగ్రహించి ప్రజలను తిట్టాడు. ఇంతకీ ఏం జరిగింది?
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా గత వారం గుంటూరు 9వ డివిజన్‌లో మురుగు కాలువల శంకుస్థాపనకు వెళ్లారు. 9వ డివిజన్‌లో సైడు కాల్వల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా.. శంకుస్థాపనకు వెళ్లిన ముస్తఫాను అడ్డుకున్న మహిళలు తమ డివిజన్‌లోని మంచి సైడ్ కాల్వలను పగులగొట్టి కొత్త కాల్వలు నిర్మించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కాల్వలను పగులగొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. మంచి పనులకు నిధులు దుర్వినియోగం కాకుండా ఇతర చోట్ల వినియోగించాలని ఎమ్మెల్యే ముస్తఫాకు సూచించారు. ఇదే విషయాన్ని స్థానిక కార్పొరేటర్ కూడా వైసీపీ నేతలకు చెప్పారు. తనను వ్యతిరేకించి కార్యక్రమాన్ని అడ్డుకున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటె వైసీపీ చేస్తున్న అరాచక పాలన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత చెలరేగుతున్న వేళా , ముస్తఫా ఆలోచనలోపడ్డారని తెలుస్తోంది, ఇదే సరైన సమయం పార్టీ మారడానికి, ఇలానే ఉంటె వైసీపీలో ఆటుపోట్లు తప్పవని టీడీపీ లో జంప్ అవాలని సన్నిహితులతో అన్నారు సమాచారం.