చంద్రబాబు అరెస్టయ్యాక రంగంలోకి దిగిన యువ నేత లోకేశ్
ఢిల్లీ పర్యటన ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండబోతున్నాయన్న వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. చంద్రబాబు అరెప్ట్ అక్రమమని, అన్యాయమని దేశమంతా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ఢిల్లీ వెళ్లిన లోకేశ్ అనేక మంది న్యాయ నిపుణులను, సీనియర్ పొలిటీషియన్లను కలిశారు. పనిలోపనిగా పలువురు బీజేపీ నేతలనూ కలిశారు. చంద్రబాబు విషయంలో వైసీపీ అనుసరిస్తున్న వ్యూహం సరికాదని వివరించారు. ఈ పర్యటనలో పలు మార్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవటం కుదరకపోయినప్పటికీ లోకేశ్ తన అభిప్రాయాన్నంతా ఓ నివేదిక రూపంలో తమ పార్టీ నేతల ద్వారా బీజేపీ హై కమాండ్‌కు చేరవేయడంలో సక్సెస్ అయ్యారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం అక్రమమన్న అంశాలతో పాటు ఏపీలో ఎన్నికల వేళ ఎదురవ్వబోయే పరిణామాలు, తెలుగుదేశం పార్టీ బలం, జనసేన తోడయ్యాక రెట్టింపైన బలగం వంటి అంశాలను ఆ నివేదికలో పొందుపరిచారు. ఈలోగా కేంద్రం ఏపీ ఫలితాల సర్వేలను కూడా పరిశీలించడతో బీజేపీ మనసు మారినట్టే కనిపిస్తోంది. దక్షిణాదిన బలం పెంచుకోవాలంటే ఏపీలో వైసీపీ కంటే తెలుగుదేశానికే రెండు రాష్ట్రాల్లో పట్టున్న అంశాన్ని అమిత్ షా బృందం ప్రధానంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చేసింది. పైగా ఉత్తరాదిన బీజేపీ కంచుకోటలన్నీ కకావికలం కాబోతున్నాయన్న జాతీయ చానెళ్ల సర్వేలు, పలు నివేదికలను పరిశీలించాక దక్షిణాదిన బలం పెంచుకోవాలని ప్లాన్ అమలు చేయబోతోంది.
ఇందులో భాగంగానే చంద్రబాబు తనయుడు, యువ నేత లోకేశ్‌కు ఆదివారం అర్థరాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారట. బీజేపీ.. తెలుగుదేశానికి ఎప్పటికీ మిత్రపక్షమేనని ఇందులో ఎలాంటి అనుమానాలకూ తావవ్వొద్దని ఆయన లోకేశ్‌కు స్పష్టం చేశారట. చంద్రబాబు అరెస్ట్ కథ కూడా త్వరలో ముగుస్తుందని, ఏపీలో ఏం జరుగుతోందో ఆలస్యంగా తెలుసుకున్నామని, వైసీపీ గురించి ఎటువంటి ఆందోళనా అవసరం లేదని అమిత్ షా చెప్పారని తెలుగుదేశం పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...











