అమరావతి మహిళల విషయంలో కృష్ణంరాజు కామెంట్స్‌తో జరిగిన డ్యామేజీని కడుక్కునే పనిలో పడ్డారు ఆ పార్టీ అధినేత జగన్. దీంతో వరుస ట్వీట్లు చేస్తున్నారు. రాత్రి 11 గంటల టైంలోనూ జగన్ ట్వీట్లు చేస్తున్నారంటే ఆయన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓ రకంగా ప్యాలెస్‌లో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ఫ్యాన్ పార్టీ చీఫ్. ఇప్పటివరకూ ఇదే ఇష్యూపై 3 సుదీర్ఘమైన ట్వీట్లు చేశారు జగన్. తాజాగా ఓ ట్వీట్ చేసిన జగన్…ఆ ట్వీట్‌లో గతంలో సందర్భానుసారంగా చంద్రబాబు చెప్పిన ఓ సామెతను మహిళలను అవమానించినట్లుగా చిత్రీకరిస్తున్నారు. ఇక లోకేష్ కాలేజ్ టైంకు సంబంధించిన ఫోటోలు పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నారు జగన్.
ఐతే జగన్ ట్వీట్‌కు మంత్రి లోకేష్ సైతం ఘాటుగా స్పందించారు. జగన్‌కు మాస్ కౌంటర్ ఇచ్చారు. తన ట్వీట్‌కు జగన్‌ను ట్యాగ్ చేసిన లోకేష్…మీ హిపోక్రసీని చూస్తే నవ్వు వస్తోంది. నేను కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేస్తే..నువ్వు జైలు జీవితం గడిపావు. నాకు క్లాస్‌మేట్స్ ఉంటే..నీకు జైలు మేట్స్ ఉన్నారంటూ ట్వీట్ చేశారు లోకేష్. ఇప్పటికైనా అర్థం అయిందా రాజా అంటూ సెటైర్ వేశారు.
మహిళలను గౌరవిస్తూ పెరిగానన్న లోకేష్…తల్లిని, చెల్లిని వెళ్లగొట్టావంటూ జగన్‌కు చెంప చెల్లుమనేలా కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు తల్లిని, చెల్లిని కోర్టుకు లాగిన చరిత్ర జగన్‌దేనన్నారు లోకేష్. సొంత మీడియాలో, సోషల్‌మీడియాలో చెల్లి వ్యక్తిత్వ హననం చేసిన విషయాన్ని కూడా జగన్‌కు గుర్తు చేశారు లోకేష్. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల కాలంలో జగన్ ప్రతీకార రాజకీయాలు, దళితులు, మహిళలపై దాడులు చేయించారని ఆరోపించారు లోకేష్. జగన్ పాలన ఓ చీకటి అధ్యాయమన్నారు లోకేష్. రాష్ట్రంలో అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛను కూడా జగన్ ఇవ్వలేదన్నారు. ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టి హింసించి ఏపీని పోలీసు రాష్ట్రంగా మార్చిన విషయాన్ని అప్పుడే మరిచిపోవద్దంటూ జగన్‌కు చురకలు అంటించారు. తన ట్వీట్‌కు జగన్‌తో సహా వైసీపీ నేతలు గతంలో మహిళలను అవమానపరిచేలా చేసిన వ్యాఖ్యల వీడియోలను జత చేశారు లోకేష్.











