కుట్ర, కక్ష్య పూరిత రాజకీయాలకు ఆంధ్రపదేశ్ వేదిక కావడం జాతీయ స్థాయిలో నేతలు, పత్రికలు సీఎం జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించటం పరిపాటై పోయింది. ఇంత జరుగుతున్న చీమకుట్టినట్టయినా లేని జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసి మరో అరాచకానికి తెర తీసింది. నెల రోజులకు పైగా ఆయన్ను రాజమండ్రి జైల్లో ఉంచి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. తాను చేస్తోంది తప్పనీ, ఈ తప్పు ఫలితానికి తప్పని సరిగా ఏదో రూపంలో శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిసి కూడా సీఎం జగన్ సైకో సిద్ధాంతాలను వీడటం లేదు.
చంద్రబాబు అరెస్ట్ వెనుక కుట్ర ఉందన్న అభిప్రాయాన్ని న్యాయవ్యవస్థకు అద్దంపట్టే జాతీయ మ్యాగజైన్ ఇండియా లీగల్ కూడా వెలిబుచ్చింది. చంద్రబాబు అరెస్ట్ ఉద్దేశ పూర్వకంగా ఎలా జరిగిందో సమగ్రంగా విశ్లేషించింది. కుట్ర రాజకీయాలకు, కుత్రంత్రాలకు పోలీసు వ్యవస్థను ఎలా ఉపయోగించుకుంటున్నదీ ఇండియా లీగల్ అభిప్రాయం పడింది. చంద్రబాబు అరెస్ట్ జాతీయ అంశంగా భావించి సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నిర్బంధమే ప్రధానాంశంగా కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది. దేశంలో ఇలాంటి కుట్ర రాజకీయాలు కొత్త కాదని అనేక మంది ముఖ్య నేతలప గతంలోఎన్నో కేసులు నడిచాయని పేర్కొంది. చంద్రబాబుపై ఆరోపణలను సీఐడీ నిరూపించాల్సి ఉంటుందని, రాజకీయ కక్ష సాధింపు, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటం ఆధారాలను నిరూపించలేకపోవటం వల్ల న్యాయ వ్యవస్థ విష వలయంలో చిక్కుకుంటుందని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.
45 ఏళ్లుగా చంద్రబాబు తెలుగు ప్రజలకు చేసిన నిస్వార్థ సేవను ప్రశంసించిన ఇండియా లీగల్ మ్యాగజైన్.. తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడని ఆరెస్ట్ తర్వాత చంద్రబాబు చేసినట్వీట్ ను గుర్తు చేసింది. ఈ కేసులో ఆధారాల కోసం సీఐడీ అధికారులు ప్రయత్నించటాన్ని తప్పుబట్టింది. మనీస్ సిసోడియా, సత్యేంద్రనాథ్ జైన్ కేసుల విషయంలోనూ సీఐడీ, ఈడీ అధికారులు ఆధారాలు రుజువు చేయలేకపోయారని మ్యాగజైన్‌చంద్రబాబుకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తు చేసింది.