అందాల తార నయనతార – డైరెక్టర్ విఘ్నేష్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ప్రేమ జంట పెళ్లి గురించి కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం చెప్పడం లేదు. అలా.. వార్తలు వచ్చిన ప్రతిసారీ.. సమయం వచ్చినప్పుడు మేమే చెబుతాం అనేవారు తప్పా.. ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇచ్చేవారు కాదు. పుట్టినరోజు వచ్చినా.. పండగ వచ్చినా.. ఈ జంట చేసే సందడి అంతా ఇంతా కాదు.
వీరిద్దరూ షూటింగ్ నిమిత్తం ఇటీవల హైదరాబాద్ రావడం జరిగింది. అయితే.. కరోనా కారణంగా ఒకే చోట ఉన్న దూరంగా ఉండాల్సి వచ్చింది. నయనతార.. రజనీకాంత్ తో అన్నాత్తే సినిమాలో నటిస్తుంటే.. విఘ్నేష్ నయనతార, సమంత లతో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. వీరి పెళ్లి గురించి తాజాగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అది ఏంటంటే.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇంట్లో పెళ్లి గురించి తొందరపెడుతున్నారట.
దీంతో నయన్ కూడా మ్యారేజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎప్పుడంటే.. ఫిబ్రవరిలో ఈ ప్రేమజంట పెళ్లి చేసుకుని ఒకటి కానున్నారని అంటున్నారు. చెన్నైలో వీరి పెళ్లిని ఫ్యామిలీ మెంబర్స్ చేయాలి అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. మరి.. ఇదే కనుక నిజమైతే.. త్వరలో నయన్ – విఘ్నేష్ ఎనౌన్స్ చేస్తారేమో.