‘రాజావారు రాణిగారు’ సినిమా ద్వారా హీరో గా పరిచయమైన కిరణ్ అబ్బవరం. ఆ చిత్రం అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది . దాంతో అతనికి వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. అందులోని రెండు పాటలు ఇప్పటికే విడుదలై, ట్రెండింగ్ లో ఉన్నాయి..ఈ చిత్రం విడుదలకు ముందే ఇంకో కొత్త చిత్రం కిరణ్ ను వెతుక్కుంటూ వచ్చింది.
కిరణ్ అబ్బవరం హీరోగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ‘సెబాస్టియన్ పిసి524’ అనే సినిమా బుధవారం ప్రారంభమైంది. ఇందులో నమ్రతా దరేకర్, కోమలీ ప్రసాద్ హీరోయిన్లు. మదనపల్లిలోని రామాలయ కల్యాణ మండపంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు. నైట్ బ్లైండ్‌నెస్ (రేచీకటి) నేపథ్య కథతో దీనిని మలుస్తున్నారు. సింగిల్ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ. ‘రాజావారు రాణిగారు’ తర్వాత నాకు మంచి ఇమేజ్ వచ్చింది. దాని తర్వాత నేను నటిస్తున్న పూర్తి కమర్షియల్ చిత్రం ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’. దీని తదుపరి ఇంకేదైనా కొత్తగా చేయాలనిపించింది ఈ క్రమంలోనే ఈ చిత్ర కథను దర్శకుడు వినిపించారు. మూడో సినిమాకే ఇంట మంచి కథ రావడం ఛాలెంజింగ్ అని చెప్పాలి’ అని అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాజ్ కె. నల్లి, కళ: కిరణ్, ,కూర్పు: విప్లవ్ న్యసదాం అందిస్తున్నారు. , కథ, దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి.
Must Read ;- బుల్లితెరపై వెలిగిపోతున్న అందాల చందమామ