హైదరాబాద్ లో ఉన్న తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (చిత్రపురి కాలనీ) ఎన్నికలు ఈ తడవ మరింత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ప్రధానంగా నాలుగు ప్యానెల్స్ ఎన్నికలలో పోటీపడుతున్నాయి. సి.కల్యాణ్, వినోద్ బాల, ఓ.కల్యాణ్, కొమర వెంకటేష్ ప్యానెల్స్ మధ్య పోటీ జరుగుతోంది. ఈ నెల 10న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతాయి.
చిత్రపురిలో దాదాపు 67 ఎకరాల విస్తీర్ణంలో సినిమా వాళ్ళ కోసం ఇళ్ల నిర్మాణం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వందలాది కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. చిత్రపురిలో అనేక సమస్యలతో పాటు నిధుల గోల్ మాల్ భారీ ఎత్హున జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము ఎన్నికలలో గెలిస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలవడంతో ప్రచారం మరింత ఊపందుకుంది.
సీఎం కేసీఆర్ హామీతో సినీ పరిశ్రమలో కొత్త ఉత్సాహం