హాలీవుడ్ కు చెందిన వార్నర్ బ్రదర్స్ నిర్మాణంలో రూపొందిన చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. వారి నుంచి రాబోతున్న తాజా చిత్రం ‘వండర్ వుమన్ 1984’. దీనికి పాటీ జెంకిన్స్, నిని దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డిసెంబర్ 24న పాన్ ఇండియా సినిమాగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో క్రిస్ పైన్ స్టీవ్ ట్రెవర్, క్రిస్టెన్ విగ్ ది చీటా, పెడ్రో పాస్కల్ మాక్స్ లార్డ్, రాబిన్ రైట్ ఆంటియోప్, కొన్నీ నీల్సన్ హిప్పోలిటా తదితరులు నటించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, “ఇది సూపర్ హీరో నటీనటులతో రూపొందిన క్లాసిక్ కథ, ప్రేక్షకులను చాలా ఆశ్చర్యపరుస్తుంది;; అని చెప్పారు. “‘ టెనెట్ ’తరువాత, డిసెంబరులో మరో చక్కట్టి చిత్రాన్ని విడుదల చేయడం మాకు చాలా గర్వంగా ఉంది. ఇది కాలానుగుణ ఫ్యామిలీ ఎంటర్టైనర్, దీనిని పెద్ద స్క్రీన్‌లో మాత్రమే చూసి ఆనందిస్తే బావుంటుంది ” వార్నర్ బ్రదర్స్ తెలిపింది.
Must Read ;- టాలీవుడ్ లో ఎస్వీకృష్ణారెడ్డి.. కోలీవుడ్ లో మురుగుదాస్