ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర యమ జోరుగా సాగుతోంది.. అయితే వర్షాకాలం సీజన్ మొదలవనుంది.. ఇప్పటికే లోకేష్ సెల్ఫీలతో సర్కార్ ని ఆడుకుంటున్నాడు.. త్వరలో వానాకాలం మొదలయితే రోడ్లన్నీ గుంతలమయం అవుతాయి.. దీంతో, కాపాడుకుంటున్న పరువు కాస్త మరింత దిగజారడం ఖాయం.. ఇటు రోడ్లు వేయాలంటే భారీగా ఖర్చు.. అంత నిధులు లేవు.. మరి, ఏం చేయాలనే అంశంపై వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది.
టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు నారా లోకేష్ పాదయాత్ర రాయలసీమలో ప్రభంజనం సృష్టించాడు, అదే ఊపులో ఇపుడు కోస్తాలోకి అడుగు పెట్టాడు, పనిలో పనిగా పాదయాత్రలో సెల్ఫీ చెల్లంగే కూడా విసురుతున్నాడు. సెల్ఫీదేముంది ఎవరైనా సెల్ఫీ దిగొచ్చు అందులో వింతేముంది అనుకోవచ్చు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది, ఇప్పటి వరకు రాయలసీమలో సాగిన లోకేష్ యువగలం పాదయాత్ర ఇపుడు కోస్త జిల్లాలోకి ఎంటర్ అయ్యాడు, మొన్నటి వరకు ఎండాకాలం కాబట్టి రోడ్లు ఎలా ఉన్న ఎవరు పట్టించుకునే నాథుడే లేకపాయ, ఇపుడు వర్షాకాలం మొదలవనుంది, ఈ వర్షాకాలమే వైసీపీ గుండెలో గుబులు, టీడీపీ శ్రేణ్ణుల్లో ఉత్సాహం.
కారణం ఏంటంటే ఆంధ్ర ప్రదేశ్లో వర్షాలు కురిశాయంటే రోడ్లు అస్తవ్యస్తంగా , ప్రతి ఒక్కరు నానావస్థ పడాల్సి వస్తుంది, మొన్న ఆ ఎండీ పవన్ కళ్యాణ్ విజయవాడ టూర్ కి పోతే జనసేన కార్య కర్తలని అడ్డుకున్నారు, రాత్రికి రాత్రే ఆగమేఘాలమీద తు తు మంత్రంగా రోడ్లు వేసి చేతులు దులుపుకున్నారు. లోకేష్ మొదలు పెట్టిన సెల్ఫీ పుణ్యాన, అదికూడా పాదయాత్రలో కాలినడకన రోడ్లు ఎలా ఉన్నాయో కళ్ళకి కట్టినట్టు మనముందు ఉంచబోతున్నాడు. ఇపుడు అదే సెల్ఫీ ఛాలంజ్ తో వైసీపీ నాయకులకు, సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సవాలు ఎదురుకానుంది.
చిన్న వర్షానికే ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతుంది, రోడ్లన్నీ గతుకులమయం , ఎక్కడ అడుగు పెడుదామన్న గుంతలు, రాళ్లు రప్పలు, ఈ రోడ్లలో గర్భిణీలు ప్రయాణిస్తే దారిలోనే ప్రసవం అయ్యేలా ఉంది ఆంధ్ర ప్రదేశ్ రోడ్ల పరిస్థితి. అందుకే వైసీపీ శ్రేణుల్లో లోకేష్ భయం పట్టుకుంది. లోకేష్ విసిరే ఛాలంజ్ కి వైసీపీ నాయకుల దగ్గర సమాధానం ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇన్ని రోజులు సొంత డప్పు కొట్టుకున్న వైసీపీ నాయకులూ భయంతో వణికిపోతున్నారు. ఇన్ని రోజులు గొప్పలు చెప్పుకున్న అధికార పక్షం ఇప్పుడు ఉన్న పరువు పోకుండా ఉంటె చాలు రా బాబు అని తలలు పట్టుకుంటున్నారు.











