ప్లీజ్ సార్ .. నా పేరును తొలగించండి!
తెలంగాణ హైకోర్టులో జగన్ కేసులు విచారణ జరుగుతోంది. వాదనలు జరుగుతుండగా .. పలువురు ఐఏఎస్, పారిశ్రామివేత్తలు విచారణను ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం కేసు వాయిదాకు వచ్చిన నిమ్మగడ్డ తన పేరును తొలగించాలని కోర్టును కోరారు. ఇందుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ ను కోర్టులో దాఖాలు చేశాడు. దివంగత నేత రాజశేఖరెడ్డి హయంలో చేపట్టిన భూ సేకరణ కోసం ప్రభుత్వానికి సహకరించాలన్న ఒప్పందం మేరకు ,రైతులకు తాము నగదు చెల్లించినట్లు తెలిపారు. అలానే జగన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడి పెట్టినందుకు, దివంగత నేత సర్కారు నుంచి ఆయాచిత ప్రయోజనాలు పొందలేదని నిమ్మగడ్డ కోర్టుకు వివరించారు. అక్రమాస్తుల కేసు నుంచి తన పేరును తొలగించాలని విజ్ఞప్తి చేశారు. వాన్ పిక్ భూములను 13 వేల ఎకరాలను కొనగోలు చేశామేకానీ ఉచితంగా పొందలేదని వివరణ ఇచ్చాడు నిమగడ్డ. ప్రభుత్వ నిర్ణయించిన దానికంటే ఎక్కువగా చెల్లించామని స్పష్టం చేశారు. నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జిస్టిస్ ఉజ్జల్ భుయాన్ విచారణ చేపట్టారు.











