యువ హీరో నితిన్ ప్రస్తుతం రంగ్ దే, చెక్, అంథాదూన్ సినిమాలు చేస్తున్నారు. ఈ మూడు సినిమాల్లో రంగ్ దే ముందుగా రిలీజ్ కానుంది. ఈ సంక్రాంతికే రంగ్ దే మూవీ రావాలి కానీ.. కొన్ని కారణాల వల్ల ఆగింది. మార్చి నెలాఖరున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే.. నితిన్, అఖిల్ డైరెక్టర్ తో మూవీ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ.. అఖిల్ డైరెక్టర్ ఎవరంటారా..?
స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత సురేందర్ రెడ్డి నితిన్ తో సినిమా చేయనున్నట్టు టాక్ వచ్చింది. అయితే.. అప్పుడు సురేందర్ రెడ్డి నితిన్ తో సినిమా ఏమీ ప్లాన్ చేయడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఇప్పుడు నితిన్ తో మూవీ కన్ ఫర్మ్ అయ్యిందని సమాచారం. నితిన్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో మూవీని ఠాగూర్ మధు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అయితే.. సురేందర్ రెడ్డి.. అఖిల్ తో మూవీని ఎనౌన్స్ చేశాడు. ఎ.కె. ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మించే ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా మూవీ చేయనున్నారు. మరి.. నితిన్ తో మూవీని అఖిల్ సినిమా అయిన తర్వాత చేస్తారా.? పవన్ తో చేయాల్సిన మూవీ కంప్లీట్ అయిన తర్వాత చేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.