అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ పదే పదే కోర్ట్ నిర్ణయాలను ధిక్కరిస్తూ చేసిన తప్పే మరలా చేస్తోంది. న్యాయ స్థానాలను ధిక్కరించి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాలకు పట్టిన గతిని కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ న్యాయ వ్వవస్థ ముందు సమానులే. ఈ ప్రాథమిక సూత్రాన్ని కూడా పట్టించుకోని జగన్ సర్కార్ పొరబాట్లు చేస్తూనే ఉంది. అందుకు రుజువుగా ఆంధ్రప్రదేశ్‌లో పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం అంశాన్ని చెప్పుకొవచ్చు. ఇవాళ హైకోర్టు ఈ అంశంపై విచారణ జరిపింది. ఈ సమయంలో పీటీషనర్ తరుపు న్యాయవాది విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం వైజాగ్ కాపులుప్పాడ కొండపై 30 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుందని కోర్ట్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం సెప్టెంబర్ 10లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సీఎస్ ను ఆదేశించారు.
ప్రభుత్వం చేస్తున్న తప్పులకు ఇప్పటికే కోర్ట్ ముందు పలుమార్లు హాజరైన సీఎస్ నీలం సహానీ షాక్ తిన్నారు. ఇంతటితో ఏపీ ప్రభుత్వం ఆగలేదు. కోర్ట్ తీర్పుతో తమకు సంబందం లేదనే ఉద్దేశంతో 30 ఎకరాలు కేటాయిస్తూ జీవోని విడుదల చేసింది. గ్రే హౌండ్స్ ఆదీనంలో ఉన్న ఈ భూమిని గెస్ట్ హోస్ట్ కు బదలాయిస్తూ సమర్థత అధికారిగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ ఈ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కోర్ట్ ధిక్కారణకు మరోమారు పాల్పడ్డ ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన చర్యలు ఉండనున్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
వైసీపీ పార్టీ శ్రేణులు కూడా తమ పార్టీ అధినాయకత్వం చేస్తున్న ఈ చర్యలకు షాక్ తింటున్నారు. జగన్ ఎందుకు కోర్టులకు వ్యతిరేకంగా వెళుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో రాజధాని అంశం మా పరిధిలోకి రాదని అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. స్టేటస్ కోని పొడిగించినా సెప్టెంబర్ 21 తరువాత ప్రభుత్వానికి ఫేవర్ గానే తీర్పు రావచ్చని కొందరు నిపుణులు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ వైసీపీ నాయకులు ఎందుకు అంత తొందర? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే గోటితో పోయే దానికి గొడ్డలి దాక తెచ్చుకున్న జగన్ ను వారు హెచ్చరిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్, ప్రభుత్వ సంస్థలకు వైసీపీ రంగులు, ప్రజలకు రాజధాని భూములు ఇవ్వాలని చేసిన ప్రయత్నాలను అడ్డుకున్న న్యాయస్థానాలు వైసీపీ సర్కార్ కు ప్రభుత్వం మొట్టికాయలు వేసిన విదితమే. ఇకనైనా ఇలాంటి దూకుడు నిర్ణయాలు తీసుకోరాదని వారు జగన్ సర్కార్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.











