పరిటాల రవీంద్ర…ఈ పేరుకు ఓ వైబ్రేషన్ ఉంది. ఇప్పుడు ఆయన స్వగ్రామం వెంకటాపురం పేరు విన్నా… ఓ రకమైన వైైబ్రేషన్ పుట్టడం ఖాయమేనని చెప్పక తప్పదు. ఎందుకంటే…ఆ గ్రామంలో టీడీపీ తప్పించి మిగిలిన ఏ ఒక్క పార్టీకి స్థానం లేదు. ఊరిలో ఉన్న అన్ని ఇళ్లపై టీడీపీ జెండాలే ఎగురుతున్నాయి. అంతేకాదండోయ్… ఊరిలో ఉన్న ప్రతి ఓటరు టీడీపీ క్రియాశీలక సభ్యుడే. వైసీపీ ఇక ఆ ఊరిలో ఇతర పార్టీల ఊసు వినబడదు. గ్రామంలో కనీసం ఇతర పార్టీల జెండాలు అసలు కనిపించవు కూడా.
ఇలా ఒక ఊరిలో మొత్తం ఓటర్లంతా ఒకే పార్టీ సభ్యులుగా ఉండటం చాలా అరుదు. ఏ గ్రామాన్ని తీసుకున్నా… ప్రదాన పార్టీలతో పాటు చిన్నాచితక పార్టీలెకూ కార్యకర్తలు ఉంటారు. అయితే ఈ తరహా పరిస్థితికి వెంకటాపురం భిన్నమనే చెప్పాలి. గ్రామం చిన్నదే అయినా… ఇలా గ్రామంలోని ఓటర్లంతా ఒకే పార్టీకి జైకొట్టడనేది నిజంగానే ఓ ప్రత్యేెక అనుభూతిని ఇచ్చే అంశమే. వెంకటాపురం విషయంలో ఈ ప్రత్యేెక అనుభూతిని ప్రతి టీడీపీ కార్యకర్త ఫీలవుతూ ఉంటాడనే చెప్పాలి.
పరిటాల రవీంద్ర పేరు వింటేనే… టీడీపీ శ్రేణులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నాటి కాంగ్రెస్ దురహంకార పాలనకు ఎదురొడ్డి నిలిచిన నేతగా పరిటాలకు చెరగని ముద్ర ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ తో పాటు దాదాపుగా అన్ని పార్టీలు కూడా పరిటాల పేరు వింటేనే హడలిపోయిన వైనం తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. పరిటాల రవికి ఉన్న తరగని ఆదరణను చూసి… ఆయనను కాంగ్రెస్ పార్టీ హత్య చేయించగా… వైైసీపీ అధినేత జగన్ ఈ హత్యలో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు వినిపించాయి.
20 ఏళ్ల క్రితమే పరిటాల రవి హత్యకు గురైనా… ఇప్పటికీ ఆయన పేరు వింటేనే ఓ రకమైన ఫీలింగ్ కలుగుతున్నదంటే… అది ఒక్క పరిటాలకు మాత్రమే సొంతమని చెప్పాలి. అలాంటి పరిటాల స్వగ్రామంగా వెంకటాపురానికి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ససనకోట గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ మజరా గ్రామమైన వెంకటాపురంలోనే ఇప్పటికీ పరిటాల కుటుంబం నివాసం ఉంటోంది. పరిటాల సతీమణి సునీతతో పాటు పరిటాల ా వారసుడు శ్రీరామ్ కూడా వెంకటాపురం నుంచే రాజకీయాలు నడుపుతున్నారు.
ప్రస్తుతం టీడీపీ సభ్యత్వ నమోదు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వెంకటాపురం గ్రామంలోని ఓటర్లంతా టీడీపీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు. గ్రామంలో ప్రస్తుతం 581 మంది ఓటర్లు ఉండగా… వారిలో 11 మంది మరణించారు. ఇక మిగిలిన 570 మంది ఓటర్లు ప్రస్తుతం టీడీపీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు. ఫలితంగా సత్యసాయి జిల్లాలోనే కాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వంద శాతం టీడీపీ క్రియాశీల సభ్యులు కలిగిన గ్రామంగా వెంకటాపురం రికార్డులకెక్కింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ రికార్డు నమోదు చేసిన తొలి గ్రామం కూడా వెంకటాపురమేనట. తమ గ్రామం ఈ అరుదైన ఘనతను సాధించడంపై రాప్తాడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిటాల రవి సతీమణి పరిటాల సునీత హర్షం ్యక్తం చేశారు