కేంద్రంలో అధికారంలో ఉన్న బీజెపి నాయకులపై దాడిచేసే తెగువ ఎవరికుంది..? ఇంత బరితెగింపు వైసిపి వాళ్లకు రావడానికి కారణమెవరు..? వైసిపివాళ్ల హింసావిధ్వంసాలు తట్టుకోలేక కేంద్ర హోం మంత్రి అమిత్ షాను శరణువేడి సెక్యూరిటీ తెచ్చుకునే దుస్థితి ఏపి నాయకులకెందుకొచ్చింది..? తాజాగా భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై వైకాపావాళ్లు రాళ్లు, కర్రలతో దాడిచేసి భీభత్సం సృష్టించడం, గాయాలపాల్జేయడం ఏపిలో దిగజారిన శాంతిభద్రతలకు అద్దం పడుతోంది..
వైసిపి ఎంపి నందిగం సురేష్ అనుచరుల ఘాతుకమే ఇదంతా అంటూ, 3రాజధానుల శిబిరం వద్ద 60-70మంది పోలీసులు సత్యకుమార్ కారు ఆపడం, ఆ వెంటనే వీళ్లు దాడి చేయడం, ఆదినారాయణ రెడ్డి ఏడని వాహనాలన్నీ వెదకడం, ఈ దాడికి పథకరచన ముఖ్యమంత్రి జగన్ దేనని బిజెపి నాయకులే ఆరోపించడం గమనార్హం..
ఈ దాడి ప్లాన్ జగన్ దేనని, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలెళ్లాయని, దాడి సూత్రధారి వైకాపా ఎంపి నందిగం సురేశ్ అని, గూగుల్ టౌకౌట్ తీస్తే ఎక్కడినుంచి ఎవరికి ఫోన్లు వెళ్లాయో తెలిసిపోతుందని సత్యకుమార్ ఆరోపించడం, వైసిపి గుండాలు దాడి సందర్భంగా ఆదినారాయణ రెడ్డి ఏడని అడిగారని, ఉంటే చంపేసేవారేమోనని వ్యాఖ్యలు, 3రాజధానుల శిబిరం వద్ద 60-70మంది పోలీసులు సత్యకుమార్ కారు ఆపడం, ఆవెంటనే వీళ్లు దాడి చేయడం, పోలీసులంతా దాడిచేసేవారిని అడ్డుకోకుండా, భాజపావాళ్లనే దూరం నెట్టడాన్ని బట్టి ఇదంతా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజమేగా పేర్కొన్నారు..
బిజెపివాళ్లపై ఇదే తొలిదాడి కాదు, గతంలోనూ కొన్ని జరిగాయి..కర్నూలు జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డిపై దాడి, ఆత్మకూరు బిజెపి నేతలపై తప్పుడు కేసులు.. తిరుపతిలో ఎమ్మెల్సీ మాధవ్, భానుప్రసాద్ ధర్నాలు తెలిసిందే..
బీజెపినే కాదు, దాని మిత్రపక్షం జనసేనపై అయితే మరీ రెచ్చిపోయాయి వైసిపి గ్యాంగ్ లు.. పుంగనూరు జనసేన రామచంద్రయాదవ్ పై దౌర్జన్యం, అతనో పారిశ్రామికవేత్త, పేదలను ఆదుకుంటాడు, ఆయన ఇంటిపై దాడిచేసి విధ్వంసం.. ఆయన అమిత్ షా దగ్గరకెళ్లి సెక్యూరిటీ తెచ్చుకోవడం.. విశాఖ ఎయిర్ పోర్టు ఘటనపై జనసేన నాయకులు తాతారావు, మూర్తియాదవ్, విజయ్ కుమార్, విష్వక్ సేన్, గేదెల చైతన్యతో సహా 80మందిని అరెస్ట్ చేశారు. 307సెక్షన్ పెట్టారు.
ఇప్పటంలో జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవానికి 20ఎకరాల భూములు, పార్కింగ్ కు 50ఎకరాలు ఇచ్చారని కక్షకట్టి 53 ఇళ్లు కూల్చేయడం..కమ్యూనిటీ హాల్ కున్న శ్రీకృష్ణదేవరాయల పేరు తీసేసి రాజశేఖర్ రెడ్డి పేరుపెట్టడం..చిన్నపల్లెలో 120అడుగుల రోడ్డు అవసరమా, ఆ పేరుతో 53ఇళ్లు కూల్చేస్తారా..? (ఆయా కుటుంబాలకు తలా రూ లక్ష ఇచ్చారనుకోండి పవన్ కల్యాణ్)
రాజానగరం(తూగో జిల్లా)లో స్థానిక సంస్థల్లో గెలిచిన జనసేన నాయకులపై దాడులు చేశారు. ఆముదాలవలసలో జనసేన వాళ్లపై పోలీసుల సమక్షంలోనే దాడిచేశారు. భీమవరంలో చినబాబుపై దాడి, రోడ్ల దుస్థితిపై ఫ్లెక్సీలు పెట్టారని కేసులు..తనవాళ్లపై తప్పుడు కేసులు పెడితే తానే రోడ్లపైకి వస్తానని పవన్ హెచ్చరించే పరిస్థితి..
ఇక తెలుగుదేశం పార్టీ జరిగినంత హింసాకాండ, దౌర్జన్యకాండ, విధ్వంసకాండ..రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏపార్టీ మీద అన్ని అరాచకాలుగాని, అంత కక్షసాధింపుగాని లేదనేది ఘంటాపథంగా చెప్పొచ్చు..మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఛోటామోటా నాయకులే కాదు, సామాన్య కార్యకర్తలను కూడా వదలకుండా వేధించారు, తప్పుడు కేసులెట్టి జైళ్లకు పంపారు, 26మంది హత్య, హత్యాయత్నాలు, ఆస్తుల ధ్వంసం, తోటల నరికివేత, బోర్ల ధ్వంసం, గృహ దహనాలు, గ్రామ బహిష్కారాలు..ఏ స్థాయికి చేరాయంటే, సాక్షాత్తూ తెదేపా అధినేత గుంటూరులో వైసిపి బాధిత పునరావాస శిబిరాలు నడిపేంత తీవ్రస్థాయికి చేరింది వైసిపి దమనకాండ..
ఇక పార్టీల సంగతి పక్కనపెడితే, బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలపై జరిగినన్ని దాడులు గతంలో ఎక్కడా చూడలేదు, వినలేదు..కనీవినీ ఎరుగని హింసా, విధ్వంసకాండ…
మూడున్నరేళ్లలో 13మంది దళితుల హత్య. 140కిపైగా దాడి ఘటనలు. డా సుధాకర్, డా అచ్చెన్న, డా అనితా రాణి, తాజాగా డా శ్రీదేవి..జడ్జి రామకృష్ణ, మాజీ ఎంపి హర్షకుమార్, మహాసేన రాజేశ్..రాజోలులో వరప్రసాద్, విశాఖలో శ్రీకాంత్ శిరోముండనం, గురజాలలో విక్రమ్ హత్య, చీరాలలో కిరణ్ హత్య.. వేధింపులు, తప్పుడు కేసులుపెట్టి జైళ్లకు పంపడం..వేధింపులు భరించలేక పలువురి ఆత్మహత్య. డ్రైవర్ ను చంపి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ..ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం..టిడిపి అనిత, రాజు, అమరావతి ఎస్సీలపై ఎన్నెన్ని కేసులు..అసైన్డ్ భూముల కబ్జా, గ్యాంగ్ రేప్ లు,
బీసిలపై..26మంది హత్య..మాజీ మంత్రి అచ్చెన్నాయుడును 83రోజులు జైల్లో పెట్టారు, కొల్లు రవీంద్రను 54రోజులు జైల్లో పెట్టారు, యనమలపై ఎస్సీ ఎస్టీ కేసు, అయ్యన్నపై నిర్భయ కేసు, అయ్యన్న కుటుంబాన్ని టార్చర్ చేయడం, ప్రహరీగోడ కూల్చివేత, విజయ్ పై తప్పుడు కేసులు..మాచర్లలో రాజయ్య యాదవ్, సంతమాగులూరులో కృష్ణయ్య యాదవ్, వీరాస్వామి యాదవ్..
ముస్లింలపై…నంద్యాలలో అబ్దుల్ సలామ్ కుటుంబం సామూహిక ఆత్మహత్య..గుంటూరులో మౌజమ్ హనీఫ్..రాజమండ్రిలో అబ్దుల్ సత్తార్..చిత్తూరులో మిస్బా..పల్నాడులో 100 ముస్లిం కుటుంబాల గ్రామ బహిష్కారం, నెల్లూరులో ముస్లిం ఇళ్ల కూల్చివేత…
ఎస్టీలపై…మన్యంలో గిరిజనులు రోడ్డెక్కారు..నరసరావుపేటలో గిరిజన మహిళ మంత్రూబాయిని ట్రాక్టర్ తో తొక్కించి చంపారు. కర్నూలులో భర్త ఎదుటే గిరిజన మహిళపై గ్యాంగ్ రేప్ , అసైన్డ్ భూములు లాక్కున్నారు..
కిడ్నాప్ లు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, గ్యాంగ్ రేప్ లు, ఊళ్లలో నుంచి తరిమేయడం, భూములు లాక్కోవడం, ఇళ్లు కూల్చేయడం, తోటల నరికేయడం..రాక్షస కాండ, కిరాతకకాండ అంటారే అదీ ఇలా ఉండదేమో…
ఒక వర్గమని కాదు, ఒక పార్టీ అని కాదు…గత 4ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో బాధితులు కాని వర్గం లేదు, పార్టీ లేదు..అన్నివర్గాల ప్రజలు వైసిపి బాధితులే…
అరటితోటలు తగలపెట్టినోడికి ఎంపి పోస్టు ఇచ్చాడు, మాజీ మంత్రి జెసిపై మీసం మెలేసి బూతులు తిట్టినోడిని ఎంపి చేశాడు(విప్పి చూపించాడనుకో..). టిడిపి వాళ్ల కారుపై దాడిచేసినోడిని ఛైర్మన్ చేశారు. తెలుగుదేశం సెంట్రల్ ఆఫీసు ధ్వంసం చేసినోళ్లకు టెంపుల్ బోర్డులో పోస్టులు..మాజీ సీఎం ఇంటిపై రౌడీగ్యాంగ్ తో దాడికెళ్లినోడిని మినిస్టర్ చేశాడు..పింఛన్ తీసేశారేంటని అడిగిన ముస్లిం మహిళ కళ్లలో కారం కొడితే పోస్టు..పట్టాభి ఇంటిపై దాడిచేస్తే పోస్టు…అంటే ఏ మెసేజ్ ఇస్తున్నారు..? క్రిమినల్ పాలకుడైతే, క్రిమినల్స్ డెన్ గా రాష్ట్రం మారుతుందనడానికి ఏపినే ఉదాహరణ.
అగ్రికల్చర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్…గన్ కల్చర్ తెచ్చారు..గంజాయి కల్చర్ తెచ్చారు…వైసిపి ఎంపినే రికమెండ్ చేశారు గన్ లైసెన్స్ కు..భరత్ యాదవ్ మొన్న పులివెందులో ఒకడిని కాల్చిచంపాడు, మరొకడు గాయపడ్డాడు.. ఏటా రూ 22వేల కోట్ల విలువైన గంజాయి ఏపిలోనే సాగు, రవాణా, వినియోగం..తాడేపల్లి సీఎం ఇంటిదగ్గరా గంజాయే, చివరికి తిరుమలలోనూ గంజాయే.. గంజాయాంధ్రప్రదేశ్ గా చేశారు. నేరాంధ్రప్రదేశ్ గా చేశారు. క్రిమినల్స్ హెవెన్ గా ఏపిని మార్చారు..
ఎడ్యుకేషన్ హబ్ గా, ఎంప్లాయిమెంట్ హబ్ గా రాష్ట్రాన్ని చంద్రబాబు చేస్తే, గంజాయి హబ్ గా, క్రిమినల్స్ హబ్ గా జగన్ రెడ్డి చేశారు..ఇన్వెస్ట్ మెంట్స్ డెస్టినేషన్ గా చంద్రబాబు చేస్తే, క్రిమినల్స్ డెస్టినేషన్ గా ఏపిని జగన్ రెడ్డి ఈ 4ఏళ్లలో చేశారు.
వందేళ్ల క్రితం జర్మనీలో మార్టిన్ నిమోల్లర్ అన్నది..‘‘వాళ్లు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేను కమ్యూనిస్టును కాదు కాబట్టి మాట్లాడలేదు. తర్వాత వాళ్లు యూదుల కోసం వచ్చారు, యూదును కాదు కాబట్టి మాట్లాడలేదు..కేథలిక్కుల కోసం వచ్చారు, కేథలిక్కు కాదని మాట్లాడలేదు. చివరికి వాళ్లు నాకోసం వచ్చారు, అప్పటికిక ఎవరూ మిగల్లేదు నాకోసం మాట్లాడటానికని..’’
మనకిక్కడ ప్యారడీగా సూట్ అవుద్ది..‘‘వాళ్లు మొదట కమ్మోళ్ల మీద దాడిచేశారు, మేము కమ్మ కాదుకదాని వదిలేశారు..తర్వాత కాపులమీద దాడిచేశారు, మేము కాపు కాదుకదా అని వదిలేశారు.. ఆ తర్వాత బీసిలమీద, ఎస్సీల మీద, ఎస్టీలమీద, ముస్లింలమీద దాడి చేశారు.. పట్టించుకోలేదు. ఇప్పుడు చివరికి రెడ్లమీదనే దాడికి పడ్డారు..మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, గిరిధర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, భూమిరెడ్డి రామగోపాల రెడ్డి…అంటే రెడ్లను కూడా వీళ్లు వదిలిపెట్టడం లేదు..అన్నివర్గాల మీద దాడులే, భయోత్పాత హింసాత్మక చర్యలే..
అంటే అది కులాలకీ వర్తిస్తది, విపక్షాలకూ వర్తిస్తది.. టిడిపిని టార్గెట్ చేసినప్పుడే.. అచ్చెన్నాయుడుని, కొల్లు రవీంద్రను జైళ్లకు పంపినప్పుడే మిగతా విపక్షాలన్నీ ఏకమై ప్రశ్నిస్తే ఇప్పుడీవిధంగా చివరికి బిజెపిపై దాడులకు వైసిపి తెగబడ్డే స్థితి వచ్చేది కాదేమో..? కమ్మోళ్లనే టార్గెట్ చేసినప్పుడు మిగిలిన కులాలన్నీ కూడా అది తప్పని ప్రతిఘటిస్తే, ఇప్పుడా కులాలపై వైసిపి మూకలిలా బరితెగించేవి కావేమో..?
మొదటి వర్గంపై దాడి జరిగినప్పుడే మిగతా అన్నివర్గాలు ఏకమై, ఈ అరాచకశక్తులను ప్రశ్నిస్తే, ఆంధ్రప్రదేశ్ ఇంత సామూహిక విధ్వంసానికి గురయ్యేది కాదేమో..?
ఇక్కడ అంబేద్కర్ అన్నమాట గుర్తుంచుకోవాలి..‘‘రాజ్యాంగం మంచిది కాకపోయినా, దాన్ని అమలుచేసేవాడు మంచోడైతే అంతా మంచే.. రాజ్యాంగం మంచిదైనా దాన్ని అమలు చేసేవాడు మంచోడు కాకపోతే దుష్ఫలితాలే..’’ అంటే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మంచిదే, ఏపిలో దాన్ని అమలు చేసేవాడై సరైనోడు కాదన్నమాట, అందుకే ఈ హింసాకాండ, విధ్వంసకాండ..
ఈ అరాచకశక్తుల బారినుంచి ఆంధ్రప్రదేశ్ ను విముక్తం చేయాల్సింది ఏపి ప్రజలే..వాళ్లు కన్నెర్రచేస్తే తప్ప మళ్లీ ఈ రాష్ట్రం కోలుకోదు..ఈ 4ఏళ్లలో ఏం కోల్పోయామో వాళ్లే ఆలోచించాలి. ఎలాంటి ఏపి ఎలా అయ్యిందీ, ఏ స్థాయికి దిగజారిందీ తెలుసుకోవాలి. తాము చైతన్యం పొందడమే కాకుండా తోటివాళ్లలో చైతన్యం పెంచాలి.. దిద్దుబాటు చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి.
30ఏళ్లు వెనక్కి వెళ్లిన రాష్ట్రాన్ని మళ్లీ 30ఏళ్లు ముందుకు నడిపించే సమర్ధ నాయకత్వానికి మద్దతివ్వాలి.. ముందుచూపుతో మన సమాజాన్ని మరింత ముందుకు నడిపించే నాయకుడికి అండగా ఉండాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని రూపొందించేందుకు తమవంతు బాధ్యత నిర్వర్తించాల్సిన బృహత్తర కర్తవ్యం రాష్ట్ర ప్రజానీకానిదే.
ప్రకాశంపై బోటు బాంబు నిజమే..!! ఆ నీచుడు దొరికాడు..!!
విజయవాడను వరదలు ముంచెత్తుతున్న వేళ జగన్ మోహన్ రెడ్డి చేసిన భారీ కుట్ర...