July 12, 2026 3:24 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

మంది సొమ్ముతో దేశంలో శ్రీమంత సీయం సుద్దులు

ఆ మధ్య దేశంలో వున్న 30 మంది ముఖ్యమంత్రులలోఏపీ సియం జగన్ రెడ్డి మహా శ్రీ మంత ముఖ్యమంత్రిగా నిలిచినట్లు ప్రముఖ వెబ్ పత్రిక ది ప్రింట్ వెల్లడిoచింది.

April 7, 2023 at 5:19 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, Latest News
YS Jagan

YS Jagan

Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆ మధ్య దేశంలో వున్న 30 మంది ముఖ్యమంత్రులలోఏపీ సియం జగన్ రెడ్డి మహా శ్రీ మంత ముఖ్యమంత్రిగా నిలిచినట్లు ప్రముఖ వెబ్ పత్రిక ది ప్రింట్ వెల్లడిoచింది. అన్ని రాష్ట్రాల సియం ల గత ఎన్నికల అఫిడవిట్ లను సేకరించి వారి ఆస్తులు వెల్లడించింది.దేశంలో అత్యంత ధనవంతుడిగా ఏపీ సియం రూ 373.8 కోట్ల తో మొదటి స్థానంలో ఉండగా చివరన పచ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆస్తి కేవలం రూ 15 లక్షలు మాత్రమే ఉన్నట్లు వెబ్ పత్రిక వెల్లడించింది.అఫిడ విట్ లో పెట్టిన ఆస్తుల వివరాలు మాత్రమే ప్రముఖ పత్రిక వెలువరించింది.కానీ అఫిడవిట్ లో చూపని ఆస్తులు ఇంకెన్ని వుంటాయో ఎవరికీ తెలియదు. చట్టబద్ధ పద్ధతుల్లో,ప్రజ్ఞాపాటవాలతో ఎవరు ఎదిగినా ఎవ్వరికి అభ్యంతరం ఉండదు.కానీ రాష్ట్రప్రయోజనాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఎల్లలెరుగని అవినీతికి పాల్పడి జన ఖజానాకు చేరాల్సిన సమస్తాన్నితనయుడు జగన్ ఖజానాకు తరలించిన తీరు దేశ ప్రజానీకాన్నినివ్వెర పరిచింది.దేశంలో అందరి ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ కలిపినా ఏపీ సియం జగన్ రెడ్డి ఆస్తుల విలువతో సమానం అని చెప్పాలి. దేశంలో మంది సొమ్ముతో మహా శ్రీమంతుడు గా వెలిగిపోతున్న జగన్ రెడ్డి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రప్రయోజనాలు నేల కూల్చిన శిధిలాల మీదనే తన జగన్మోహన్‌ రెడ్డి వ్యాపార సామ్రాజ్యం మర్రిచెట్టులా విస్తరించింది.తానేం చేసినా ప్రజా ప్రయోజనాల కోసమేనని బుకాయించి ఎక్కడికక్కడ అవినీతి గోపురాలు నిర్మించిన చరిత్ర భారత దేశంలో సాటిలేరు జగన్ రెడ్డికి . రాజ్యాoగ యాత్రాoగాన్నితన దోపిడీకి సాధనంగా మార్చి వారికి సలహాదారులను జతచేసి ఎదురుదాడి వ్యూహంతో,విపక్షాల గొంతు నొక్కి ప్యాక్షనిజం నైజం తో జగన్ బొక్కింది ఏంతో ఏ ఆర్ధిక గణాంకుడు లెక్క తేల్చగలరు. జగన్ రెడ్డి ఇంత దోపిడీకి పాల్పడి ఉంటే మరో ప్రజాస్వామ్య దేశాల్లో అయితే జగన్ బతుకు శంకరగిరి మాన్యాలు పట్టి ఉండేది. అటువంటి జగన్ రెడ్డి చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు అసెంబ్లీలో వీరంగాలు వెయ్యడం సిగ్గు చేటు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు హయాంలో 6 లక్షల కోట్లు అవినీతి జరిగిందని పుస్తకాలు వేసి ప్రచారం చేశారు.నాలుగేళ్లుగా అధికారంలో వుండి ఏం చేశారు.మరో ఆరు నెలల్లో మీ ప్రభుత్వానికి నూకలు చెల్ల బోతున్న సమయంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో ఏకంగా రూ.371 కోట్లు దోచేశారు అంటూ వీరంగాలు వేస్తున్నారు.ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికే మీ అబద్దాల కోటలు కూలడం మొదలు అయింది. నేరగాళ్లకు దేవుడు మొట్టికాయలు వేస్తాడు అంటున్నారు.కానీ జగన్ రెడ్డిని మించిన ఆర్ధిక నేరగాళ్లు ప్రపంచంలో ఉన్నారా? 16 చార్జి షీట్లు వున్న వ్యక్తి నేరగాడా?ఒక్క చార్జి షీటు కూడా లేని వ్యక్తి నేరగాడా? 16 నెలలు జైలు జీవితం గడిపి, బెయిల్ పై బయట వున్న వ్యక్తి నేరగాడా? ఒక్క కేసు లేకుండా, ఏనాడు జైలు కి వేళ్ళని వ్యక్తి నేరగాడ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.

మంది సొమ్ముతో మహా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న జగన్ రెడ్డి గత ప్రభుత్వంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం జరిగిందంటూ అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పడానికి ఆప సోపాలు పడ్డారు.నిరుద్యోగుల పేరిట జరిగిన అతిపెద్ద స్కాం అని,ఇది రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే నిరుద్యోగులు,విద్యార్ధుల పేరిట జరిగిన అతిపెద్ద స్కాం అని ఇష్టాను సారం బరితెగించి అబద్దాలు చెప్పారు.దోపిడీ– బాబుకి తెలిసిన స్కిల్‌.స్కిల్లింగ్‌ ద్వారా నిజంగా పిల్లల స్కిల్స్‌ అభివృద్ధి చేసి తద్వారా ఉద్యోగాలలో వాళ్లకు వచ్చే అవకాశాలను మెరుగుపర్చాలని ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేయాలి. కానీ ఆ స్కిల్లింగ్‌ పేరుతో ఏకంగా డబ్బులు దోచేయడం అన్నది, నిజంగా చంద్రబాబునాయుడు గారికే మాత్రమే తెలిసిన గొప్ప స్కిల్‌ అన్నారు. పద్ధతి ప్రకారం రూ.371 కోట్ల దోపిడీ చేశారని,చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారం ముఠాగా ఏర్పడి యూత్‌కు శిక్షణ పేరుతో ఈ డబ్బంతా దోచేయడం బాధాకరం అని, ఈ డబ్బు దోచేయడానికి చంద్రబాబు విజన్‌ ఏంటో బాగా కనిపిస్తోందని, చేయని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఎలా చూపించాలి ? దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలి ? చట్టానికి దొరక్కుండా ఏయే ఫైల్స్‌ను ముందుగానే మాయం చేయాలి ? దర్యాప్తు జరిగితే తప్పించుకోవడానికి ఏం చేయాలి ? అసలు విచారణ జరగకుండా ఏం చేయాలి ? ఇవన్నీ కూడా ముందుగానే ఊహించుకుని ఈవిజన్‌ రూపకల్పన చేశారని అసెంబ్లీలో మాట్లాడారు.స్కిల్ డెవలప్ మెంట్ పై నాలుగేళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాలుగేళ్లుగా మీరు చేసిన దర్యాపు ఏమిటి?నిధులు ఏ పెద్దల ఖాతాలోకి వెళ్ళాయో డిటైల్స్ ఎందుకు రిలీజ్ చెయ్యరు? ఎదో కంపెనీలో అక్రమాలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎమిటి సంభందం?సీమెన్స్ కంపెనీ ప్రతినిధుల్నివిచారణకు ఎందుకు పిలవరు?సీమెన్స్ కంపెనీ తప్పు చెయ్యకుండా చంద్రబాబు మాత్రమే తప్పు చేశారు అని ఎలా చెబుతారు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భారం నుండి తప్పించుకోవడానికి స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి జరిగిందంటూ అసెంబ్లీలో చంద్రబాబు పై అసత్యాలతో చిందులు వెయ్యడం సిగ్గు చేటు.

తన తండ్రి ముఖ్యమంత్రి కాకముందు అప్పులు కారణంగా ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని మొరపెట్టుకున్న కుటుంభం కర్ణాటకలో 22.5మెగావాట్ల చిన్న సెకండ్ హ్యాoడ్ విద్యుత్తు ప్లాంట్ నడుపుకొంటున్న జగన్ రెడ్డి కి ఐదేళ్లలో ఇన్ని వేల కోట్ల ఆస్తులు,ఇన్ని కంపెనీలు స్థాపించడం ఎలా సాధ్యమైందో ప్రజలకు చెప్పాలి. భారతదేశంలో వ్యాపార దిగ్గజాలు అయిన టాటాలు,బిర్లాలు,అంబానీలు దశాబ్దాలుగా కష్టపడి సంపాదించారు. కానీ ఐదేళ్ల వ్యవధిలో ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టారో,ఆ విజయ రహస్యం ఏమిటో జగన్ రెడ్డి వెల్లడించాలి. దాదాపు 19 సంవత్సరాల క్రితం జగన్‌ ఆర్ధిక పరిస్థితి ఏపాటివో ప్రపంచం అంతా తెలుసు.2004లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు జగన్మోహన్‌ రెడ్డి సామాన్యుడు మాత్రమే.చేసిన వ్యాపారాలు కూడా పెద్దగా లేవు. బడా కాంట్రాక్ట్‌ కంపెనీల వద్ద చిన్న,చిన్న సబ్‌ కాంట్రాక్టులు చేసేవారు. ఆ సమయంలో తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.కర్ణాటకలో సండూర్‌ పవర్‌ కంపెనీ ఏర్పాటుకు జగన్‌కు అవకాశం లభించింది.అయితే చేతిలో చిల్లిగవ్వ లేదు దీంతో రాజశేఖర రెడ్డి నివాసం ఉన్న బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–2 లోని ఇంటిని తాకట్టుపెట్టు కొని అప్పు ఇవ్వవలసిందిగా తెలిసిన వారి వద్దకు వెళ్లేవారు. తండ్రి చేతిలో అధికారం ఉండటంతో అప్పు చేసే అవసరమే లేకుండా కంపెనీల మీద కంపెనీలు ఏర్పాటు చేయడం ఎలాగో జగన్‌కు తెలిసిపోయింది.ఇంకేముంది జగన్మోహన్‌ రెడ్డి వ్యాపార సామ్రాజ్యం కొండలా పెరిగింది . అప్పటి వరకు జగన్‌ను పట్టించుకోని బడా కంపెనీలకు చెందినవారు ఆయన కంపెనీలలో ఉచితంగా ఎడాపెడా పెట్టుబడులు పెట్టడానికి క్యూలో నిలబడ్డారు. దీంతో కంపెనీలను జగన్మోహన్‌ రెడ్డి శరవేగంగా ఏర్పాటు చేశారు. ప్రపంచ చరిత్రలోనే మొదటిసారిగా దాదాపు రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో సొంత మీడియాను ఏర్పాటు చేసుకున్నారు. జగన్‌ సారథ్యంలో ప్రారంభమైన నీలి మీడియాలో ఆయన జేబు నుంచి ఎంత పెట్టుబడి పెట్టారో తెలియదు.తండ్రి చేతికి అధికారం రాగానే ఆయనలోని వ్యాపారవేత్త జడలు విప్పి నాట్యం చేసింది. 2004లో అధికారంలోకి వచ్చి ఉండకపోతే రాజశేఖర రెడ్డి దివాలా తీసి ఉండేవారన్న విషయం అందరికి తెలిసిందే. రాజశేఖర రెడ్డి ఐదేళ్ల పాలన పూర్తయ్యేసరికి జగన్మోహన్‌ రెడ్డి డజన్ల సంఖ్యలో షల్ కంపెనీలు ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాల్లో రాజప్రాసాదాలు నిర్మించుకున్నారు.

అప్పటివరకు కొన్నిచోట్ల అద్దె భవనాల్లో ఉన్న జగన్‌ మీడియా సంస్థలను సొంత భవనాల్లోకి మార్చారు. సండూరు పవర్‌ కంపెనీ కోసం తాకట్టు పెట్టాలనుకున్న ఇంటి స్థానంలో భారీ భవనాన్ని నిర్మించారు. నెలనెలా కోట్ల రూపాయల అద్దెలు తెచ్చిపెట్టే భవనాలు నిర్మించుకున్నారు.భారీ పెట్టుబడితో భారతీ సిమెంట్‌ కంపెనీ ఏర్పాటు చేశారు.ఇలా ఐదేళ్లలో జగన్‌ వ్యాపార సామ్రాజ్యం నలుదిశలా విస్తరించింది. అది చూసి వ్యాపార దిగ్గజాలకు నోటమాట రాలేదు. దీంతో అధికారం చేతిలో ఉంటే ఎంతలా అభివృద్ధి చెందవచ్చో అమలు చేసి చూపించిన జగన్‌రెడ్డికి తానే ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదన్న ఆలోచన వచ్చింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేవలం ఐదేళ్లలో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోని దేశం లో అత్యంత శ్రీమంత ముఖ్యమంత్రి గా నిలిచారు జగన్ రెడ్డి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల కేసుల విచారణ ఏడాదిలోగా తేలిపోవాలని సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో స్పష్టంచేసినా జగన్మోహన్‌ రెడ్డి మాత్రం చిద్విలాసంగా ఉండగలుగుతున్నారంటే ఆయన శక్తిసామర్థ్యాలు ఏపాటివో తెలియడం లేదా?అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల కేసుల విచారణ ఏడాదిలోగా తేలిపోవాలని సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో స్పష్టంచేసినా జగన్మోహన్‌ రెడ్డి మాత్రం ధైర్యంగా ఉండగలుగుతున్నారంటే ఆదుకొనే వారు ఉన్నారనే.జగన్ అధికారము ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడటం లేదు. అధికారాన్ని రాజకీయంగా, ఆర్థికంగా తాను అభివృద్ధి చెందడానికి మాత్రమే జగన్‌ తన తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. జగన్ కు రాష్ట్ర,ప్రజా విశాల ప్రయోజనాలు ఆయనకు అవసరం లేదు. తన అధికారం, పలుకుబడి, డబ్బు అన్నీ సొంత అవసరాలకే వినియోగిస్తారు. ఆయన ఆలోచనలు,చేతలు అన్ని కపటత్వమే. రాష్ర్టానికి రాజధాని లేకపోయినా, రాష్ట్రం అభివృద్ధి ఆగిపోయినా ఆయనకు ఏ భాధా , చింతా ఉండదు. తన వ్యాపారాలు, తన కుటుంబం మాత్రమే బాగుండాలి. విధి వికటించి అధికారం పోతే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆయన నివసించకపోవచ్చు. హైదరాబాద్‌, బెంగళూరులో ఆయనకు రాజప్రాసాదాలు ఉన్నాయి. ఆ నగరాల్లోనే వేల కోట్ల ఆస్తులూ ఉన్నాయి. అందుకే ఆయనకు ఏ దిగులూ ఉండదు. కష్టం వస్తే ఆదుకోవడానికి పై వారు ఎలాగూ ఉన్నారన్న ధీమాతో వున్నారు. అవినీతి పరులే పాలకులైతే ప్రజలు తమను తాము కాపాడుకోవడం తప్ప మరో మార్గం లేదు. తనకంటిన అవినీతి బురదని చంద్రబాబుకి పూయడం కోసం అసెంబ్లీ సాక్షిగా జగన్ రెడ్డి చెప్పిన అబద్దాలు ప్రజలు అర్ధం చేసుకోలేనంత అమాయకులు కాదు. నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్నచందంగా అవినీతి పై జగన్ రెడ్డి నీతులు చెప్పడం చూసి జనం నవ్వు కొంటున్నారు.

Tags: ap 2024 electionsbharati cementleotopys bharatiys jaganys jagan affadavitys jagan assetsys jagan bangalore assetsys jagan daughtersys jagan propertiesys rajashekar
Previous Post

ఏపిలో ఎవరికుంది భద్రత..? నేరాంధ్రప్రదేశ్ గా ఏపి

Next Post

కూలుతున్న జగన్ రెడ్డి అహంకార కోటలు

Related Posts

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Disha Patani Mind Blowing Hot Pics

మనిషికి ఎందుకీ తాపత్రయం?

‘దృశ్యం 2’ మూవీ రివ్యూ

అమరావతిలో మరో సంచలనం.. దేశంలోనే అతి పెద్ద లైబ్రరీ..

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

డ్రిగ్రీ విద్యార్థిని దారుణహత్య!

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist