అందరూ ఊహించినట్టుగానే కవిత ఎమ్మెల్సీగా బంపర్ మెజారీటీతో గెలిచింది . టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఇక రాష్ట్రంలో చట్టసభల్లో అడుగుపెట్టిన కవితకుకేబినేట్ బెర్త్ కన్ఫాం అనుకున్నారంతా. రాష్ట్ర మంతా ఇదే చర్చ సాగింది. కేబినేట్ లోకి తీసుకుని ఏ పదవి ఇస్తారు.. కేటీఆర్ , హరీష్ లతో సమానంగా ప్రాదాన్యత ఉన్న పదవి ఇస్తారా లేక కొత్తగా వచ్చిన నేపథ్యంలో మరేదైనా మంత్రి పదవి ఇస్తారా అంటూ జోరుగా చర్చ సాగింది. అయితే కేసీఆర్ కుటుంబం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఏ సంకేతం రాలేదు. కవిత సైతం ఇప్పటి వరకు తనకు కేబినేట్ లో స్థానంపై స్పందించలేదు. ఇంతలోనే తనను కలిసిన ఓ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్ రావడంతో సెల్ఫ్ క్వారెంటైన్ కు వెళ్ళిపోయారు. ఇక ఎమ్మెల్సీగా గెలిచిన రెండురోజులకే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తుందని భావించినా కరోనా కారణంగా అది కూడా వాయిదా పడింది. దీంతో ప్రమాణ స్వీకారం తేదీని ఖరారు చేయాల్సి ఉంది.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చర్చకు ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం దొరకలేదు. అయితే ఈ సారి కేబినేట్ లో స్థానం ఇస్తారా అంటే టీఆర్ఎస్ వర్గాల నుండి రాకపోవచ్చేమో అన్న అనుమానం వ్యక్తం చేసారు. ప్రస్తుతం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం ఉప ఎన్నికలే కావడంతో మరో ఏడాదిన్నర మాత్రమే పదవీ కాలం ఉంటుంది. దీంతో ఇప్పుడే క్యాబినేట్ లో స్థానం కల్పించి విమర్శల పాలవడం కంటే ఫూల్ టైం ఎమ్మెల్సీగా గెలిచిన తరువాతే తీసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారట టీఆర్ఎస్ బాస్ . అప్పటి వరకు కవిత కొత్తగా గెలిచిన ఎమ్మెల్సీ అని వెంటనే కేబినేట్ బెర్త్ ఎలా ఇస్తారన్నవిమర్శలకు చెక్ పెట్టినట్టవుతుందని భావిస్తున్నారని సమాచారం. ఇక అప్పటి వరకు కవితను సంతృప్తి పరిచేందుకు కేబినేట్ హోదా కలిగిన నామినేటెడ్ పోస్టు ఇస్తారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేబినేట్ బెర్త్ ఇవ్వాలంటే విపక్షాల నుండి వచ్చే విమర్శలు తట్టుకుని … ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియక ఇబ్బంది పడే కంటే ఇలా తన చేతిలో ఉండే పవర్స్ తో కేబినేట్ హోదా ఇస్తే ఏ ఇబ్బందులు ఉండవన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.
అయితే కేబినేట్ బెర్త్ కోసం కవిత ఎదురు చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ యోచనను కవిత ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. కేబినేట్ హోదా ఇస్తే సర్దుకుని బెర్త్ దొరికే వరకు వేచిచూస్తారా … లేదంటే ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి బెర్త్ కన్ఫామ్ చేసుకుంటారో చూడాలి. అయితే ఈ విషయాలు బయట పడాలంటే కవితే నోరు విప్పాలి. డైరెక్ట్ గా కాక పోయినా తన సన్ని హితుల వద్ద అయినా మాట్లాడితే గాని అసలు సంగతి తెలియదు. ఇప్పటికే ఎంపీగా ఓడిపోయిన తరువాత చట్టసభల్లో కూర్చునేందుకు కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసిందని చెప్పుకుంటారు. అలాంటిది మండలికి గెలిచిన కవిత మంత్రి పదవి ఇవ్వక పోతే ఊరుకుంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.