యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఈ ఫ్యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో మరోసారి వీరిద్దరూ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు. అల.. వైకుంఠపురం తర్వాత త్రివిక్రమ్, ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు.
ఈ క్రేజీ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. 2020 సమ్మర్ లో ఈ సినిమాని స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అయితే.. కరోనా రావడంతో ఆగింది. దీంతో త్రివిక్రమ్ ఈ సినిమా కంటే ముందుగా మరో సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఎన్టీఆర్ మార్చి నుంచి ఈ సినిమా చేద్దాం డేట్స్ ఇస్తానని మాట ఇవ్వడంతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నారు.
అయితే… న్యూయర్ సందర్భంగా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలిశారు. ఈ ఫోటోలను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ట్విట్టర్ లో ఈ ఫోటోలను పోస్ట్ చేయడంతో మరోసారి ఈ మూవీ వార్తల్లో నిలిచింది. దీనికి అయిననూ హస్తినకు పోయిరావలే అనే టైటిల్ ప్రచారంలో ఉంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మరి.. ఇది నిజమేనా కాదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: రియాల్టీ షో చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే.











