యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నారు. అయితే.. కేజీఎఫ్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా చేయాలి అనుకున్నారు. ఎన్టీఆరే కాకుండా.. మహేష్ బాబు కూడా ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ తో కానీ, మహేష్ తో కానీ ప్రశాంత్ నీల్ సినిమా అంటూ అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుంది అనుకుంటే.. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ మూవీని ప్రకటించి షాక్ ఇచ్చారని చెప్పచ్చు.
దీంతో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ ఉందా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి కథ చెప్పడం జరిగిందట. ఆ కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చిందట. అయితే.. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ కంప్లీట్ చేయాలి. ఆతర్వాత త్రివిక్రమ్ తో సినిమా కంప్లీట్ చేయాలి. ఇదంతా జరగడానికి టైమ్ పడుతుంది కనుక ప్రశాంత్ నీల్ ప్రబాస్ తో సినిమాకి ఓకే చెప్పారట. అయితే.. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ క్యాన్సిల్ కాలేదని.. ఈ ప్రాజెక్ట్ ఉందని తెలిసింది. అవును.. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అంటున్నారు.
ఈ క్రేజీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్టు సమాచారం. ప్రశాంత్ నీల్ సలార్ మూవీని జనవరి నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఈ మూవీ షూటింగ్ సమ్మర్ కి కంప్లీట్ చేయాలనేది ప్లాన్. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారని తెలిసింది. ఈ లెక్కన త్రివిక్రమ్ తో చేయనున్న సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడం పక్కా అని సమాచారం. అదీ.. సంగతి.
Must Read ;- రియాల్టీ షో కోసం ఎన్టీఆర్ కు షాకింగ్ రెమ్యూనరేషన్